వైరల్ వీడియో: డ్రమ్ లో ఇరుకున్న భారీ అనకొండ..! కాకపోతే..?!

ఇంటర్నెట్ వేదికగా ప్రత్యక్షమయ్యే కొన్ని వీడియోలు వళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి.

అటువంటి వీడియోలను చూడగానే మనం వెంటనే మా ఫ్రెండ్స్ తో దాని తెలిసిన వాళ్లతో కానీ షేర్ చేసుకుంటాము.

కానీ ఆ వీడియోలలో చూసేదంతా నిజమా అబద్దమా అనేది తేలాలంటే.కాస్త ఆలోచించాల్సి ఉంటుంది.

ఎందుకంటే నేటి డిజిటల్ యుగంలో ఏది నిజమో ఏది అబద్ధమో ఎవరూ కనుక్కో లేకపోతున్నారు.ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి ఒక ఫేక్ డిజిటల్ ప్రపంచాన్ని సామాన్య ప్రజల ముందు ఉంచుతున్నారు కొందరు కేటుగాళ్ళు.

తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఒక అనకొండ వీడియో సినిమాల్లో సన్నివేశాల కంటే మరింత భయానకంగా ఉంది.దీనితో ఇటీవలే అప్లోడ్ అయిన ఈ వీడియోకి కోటిన్నరకు పైగా వ్యూస్ వచ్చాయి.

Advertisement
Huge Python Trapped Using PVC Pipe Viral Video, Fake Video, Netizens, Anakonda,

ఈ వైరల్ వీడియోలో ఏం కనిపించిందంటే.ఒక పెద్ద డ్రమ్ము.

దాని చుట్టు పాతిన పొడవైన కర్రలు.ఓ పెద్ద మురికి నీటి కాలువ.

అయితే ఈ మురికి నీటి కాలువ ఒడ్డున ఒక కోడి నిల్చుని ఉంది.ఆ కోడిని వేటాడడానికి కాలువలో నుంచి ఒక పెద్ద అనకొండ శరవేగంగా దూసుకొచ్చింది.

ఐతే ఆ కోడి డ్రమ్ముకు ఎదురుగా అవతల వైపు నిల్చొని ఉంది.డ్రమ్ము చుట్టూ కర్రలు ఉండటంతో.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?

వేరే వైపు నుంచి వెళ్లలేని పాము చివరికి డ్రమ్ము లోకే ప్రవేశించగా.క్షణాల్లోనే డ్రమ్ములో చిక్కుకుపోయింది.

Advertisement

డ్రమ్ము నుండి బయటకు రావాలని ఎంత ప్రయత్నించినా ఆ పాము విఫలం అయ్యింది.

Huge Python Trapped Using Pvc Pipe Viral Video, Fake Video, Netizens, Anakonda,

ఐతే ఈ దృశ్యాలన్నీ కూడా చాలా సస్పెన్స్ గా, భయంకరంగా ఉన్నాయి.కానీ అసలు విషయం తెలిస్తే ఆశ్చర్య పోవడం ఖాయం.ఎందుకంటే ఈ వీడియోలో కనిపించిన పాము చాలా చిన్నది.

డ్రమ్ముగా కనిపించేది ఒక పివిసి పైప్ కాగా.ఆ పైపు కోడి కంటే చిన్నగా ఉండటం మనం గమనించవచ్చు.

అలాగే చిన్న నీటి గుంతలో దూసుకొచ్చిన పాముని ట్రాప్ లో పడేసిన దారాన్ని చూడొచ్చు.ఆ దారం ఒక చిన్న కర్రకు చుట్టి ఉన్నట్టు కూడా గమనించవచ్చు.

ఈ వీడియో మొదటిసారిగా చూసి మోసపోయిన కొంతమంది నెటిజనులు ఇతరులు మోసపోవద్దన్న ఉద్దేశంతో.ఒరిజినల్ వీడియోను, ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు.

ఈ ఒరిజినల్ వీడియోలలో పైప్ మరియు పాము చాలా చిన్నగా కనిపించడం తో.కొందరు షాక్ కి గురయ్యారు.

తాజా వార్తలు