సోషల్ మీడియా ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత రకరకాల వీడియోలు ఇక్కడ వైరల్ అవడం మనం చూస్తూ వున్నాం.
ఈ మధ్య కాలంలో ముఖ్యంగా జంతువులకు సంబందించినవి నెటిజన్లు ఎక్కువగా చూస్తుండడం మనం గమనించవచ్చు.
ఇక కొండచిలువల( Python ) దాడి గురించి ప్రత్యేకంగా జనాలకి ఇక్కడ చెప్పాల్సిన పనిలేదు.వాటి నోరు చూసేందుకు చిన్నదే అయినా పెద్ద పెద్ద జంతువులను సైతం అవి అవలీలగా మింగేస్తుంటాయి.
ఈ క్రమంలో కొన్నిసార్లు అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా వింత వింత ఘటనలు చోటు చేసుకోవడం మనం సోషల్ మీడియాలో గమనించవచ్చు.జంతువులను ( Animals ) వేటాడే క్రమంలో ప్రమాదంలో పడిపోయిన పాములు, కొండచిలువలను మీరు గమనించవచ్చు.
తాజాగా, ఇటువంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది.అవును, పెద్ద జంతువును మింగిన కొండచిలువకు ఊహించని సమస్య వచ్చి పడింది.సోషల్ మీడియాలో( Social Media ) వైరల్ అవుతున్న ఆ వీడియోని ఒక్కసారి గమనిస్తే, ఓ పెద్ద కొండచిలువ వేట కోసం తచ్చాడుతూ చివరకు ఓ షెడ్డు వద్దకు చేరుకుంటుంది.
ఆ తరువాత అందులో ఉన్న జంతువులను టార్గెట్ చేసి.చివరకు చాకచక్యంగా వాటిని వేటాడింది.ఈ క్రమంలో వాటిలో ఓ పెద్ద జంతువును అవలీలగా మింగేసింది.
ఆ తర్వాతే దానికి ఊహించని సమస్య వచ్చింది.అంత పెద్ద జంతువును మింగడంతో కడుపు భారమై కదలలేక, మెదలలేక నానా తిప్పలు పడింది.
సరిగా అదే సమయంలో కంచెను దాటే క్రమంలో కొండచిలువ తల ఓ తాడులో ఇరుక్కుపోతుంది.అంతకుముందే అక్కడ ఏర్పాటు చేసిన ఓ ఉచ్చులో( Trap ) చిక్కుకుపోతుంది.తరువాత తలను అటూ ఇటూ ఊపడంతో ఉచ్చు మరింత బిగుసుకుపోతుంది.
కాగా అక్కడ ఉచ్చు ఏర్పాటు చేసిన వారు అక్కడికి వచ్చి కొండచిలువను బయటికి లాగేందుకు ప్రయత్నిస్తారు.కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించడం ఇక్కడ చూడవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy