పీవీ సింధుకు జగన్‌ భారీ నజరానా

వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ విజేత, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు నేడు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని గౌరవ పూర్వకంగా కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది.

ఈ సందర్బంగా మంత్రులు మరియు పలువురు వైకాపా నాయకులు కూడా ఉన్నారు.

ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ ట్రోఫీని దక్కించుకున్న పీవీ సింధును జగన్‌ సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా సింధు తల్లిదండ్రులతో జగన్‌ ముచ్చటించారు.

తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశం మొత్తం గర్వించదగ్గ విజయాన్ని సాధించావంటూ సింధును జగన్‌ అభినందించాడు.ఈ సందర్బంగా జగన్‌ వైజాగ్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమి ఏర్పాటుకు పీవీ సింధుకు అయిదు ఎకరాల భూమిని కేటాయించేందుకు ఒప్పుకున్నారు.

ఏపీలో బ్యాడ్మింటన్‌ అకాడమి ఏర్పాటు చేయాలంటూ స్వయంగా సీఎం జగన్‌ కోరినట్లుగా తెలుస్తోంది.తప్పకుండా వైజాగ్‌లో బ్యాడ్మింటన్‌ అకాడమి విషయమై ఆలోచిస్తానంటూ పీవీ సింధు హామీ ఇచ్చింది.

Advertisement

పీవీ సింధు ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ మరియు అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి సన్మానం పొందిన విషయం తెల్సిందే.

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?
Advertisement