అలీతో సరదాగా షోలో పీవీ సింధు.. ప్రభాస్ అంటే ఇష్టం అంటూ!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గురించి మనందరికీ తెలిసిందే.

భారత్కు ఆమె ఎన్నో మంచి మంచి పథకాలను అందించి భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన విషయం తెలిసిందే.

అంతేకాకుండా ఆమె ఇటీవలే గోల్డ్ మెడల్ ని కూడా సాధించింది.ఒలంపిక్ మెడలిస్ట్ భారత్ స్టార్ షట్లర్ గా ఈమె మనందరికీ సుపరిచితమే.

ఇది ఇలా ఉంటే ఇంటర్వ్యూలలో చాలా అరుదుగా కనిపించే పీవీ సింధు తాజాగా ఒక తెలుగు ఇంటర్వ్యూలో పాల్గొంది.ఈ ఇంటర్వ్యూలో భాగంగా తన ప్రేమ పెళ్లి విషయాల గురించి, తన ఫేవరెట్ హీరో గురించి, సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడం విషయంపై గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది పీవీ సింధు.

అలాగే ఇంటర్వ్యూలో భాగంగా అలీ అడిగిన ఎన్నో ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం ఇచ్చింది.అప్పుడు అలీ గెలిచిన తర్వాత మెడల్ తీసుకున్న సమయంలో మన చేతిలో జాతీయ జెండా ఉంటుంది కదా అప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనీ అలీ ప్రశ్నించగా.

Advertisement
Pv Sindhu About Prabhas Latest Interview Details, PV Sindhu, Interesting Comment

విదేశాలలో మన జాతీయ గీతం లే అవుతున్న సమయంలో నాకైతే కన్నీళ్లు వస్తుంటాయి.మన జాతీయ గీతం మన దేశ పతాకం విదేశాలలో వినిపించినప్పుడు, కనిపించినప్పుడు నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది సింధు.

ఆ తర్వాత అలీ మీకు ఏమైనా లవ్ లెటర్స్ వచ్చాయా అని అడగగా.ఆ వచ్చాయి.

Pv Sindhu About Prabhas Latest Interview Details, Pv Sindhu, Interesting Comment

ఆ ప్రేమలేఖలన్నీ మేము మా ఇంట్లో అందరూ కూర్చొని చదివే వాళ్ళం అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది పీవీ సింధు. అంతే కాకుండా ఒక 70 ఏళ్ల వ్యక్తి తనని పెళ్లి చేసుకోకపోతే తనని కిడ్నాప్ చేస్తానని అందులో రాస్తాడని అని చెప్పుకొచ్చింది.ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరో అంటే మీకు ఇష్టం అని అలీ ప్రశ్నించగా.

చాలామంది హీరోలు అంటే ఇష్టం అని సింధు అనగా వెంటనే అలీ ఎవరైనా ఒకరే అని అనడంతో ప్రభాస్ అంటే తనకు చాలా ఇష్టమని.కాకుండా మేము చాలా మంచి ఫ్రెండ్స్ కూడా.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

అని సింధు అనగా.వెంటనే అలీ ఎందుకు సేమ్ హైట్ కాబట్టా.అంటూ పంచులు వేస్తూ నవ్వించాడు.

Advertisement

తాజా వార్తలు