'పుష్ప 2'.. షూట్ సగం పూర్తి.. రిలీజ్ ఎప్పుడంటే.. క్లారిటీ ఇదే?

టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలలో పుష్ప ది రూల్( Pushpa The Rule ) ఒకటి.

పాన్ ఇండియన్ దగ్గర భారీ హైప్ ఉన్న బిగ్గెస్ట్ సినిమాల్లో పుష్ప టాప్ లో ఉంది అని చెప్పాలి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) హీరోగా లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప.ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించడంతో పార్ట్ పై అన్ని అంచనాలు పెరిగాయి.

సౌత్ ప్రేక్షకుల కంటే కూడా నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాపై ఇంకా ఆసక్తిగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్( Sandalwood Smuggling ) నేపథ్యంలో సాగే ఈ సినిమా పార్ట్ 1 సౌత్ మాత్రమే కాదు నార్త్ వాళ్ళను కూడా ఆకట్టుకుంది.అందుకే ఈసారి పార్ట్ 1 ను మించి తెరకెక్కిస్తున్నారు.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూట్( Pushpa 2 Shooting ) అసలు ఇప్పటి వరకు ఎంత పూర్తి అయ్యింది అనే సమాచారం బయటకు వచ్చింది.ఈ ఏడాది స్టార్ట్ అయిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 50 శాతం పూర్తి చేసుకుందని తెలుస్తుంది.

Advertisement

వచ్చే ఏడాది రిలీజ్ ప్లాన్ చేసారని అందుకే మేకర్స్ పుష్ప 2( Pushpa 2 ) మిగిలిన సగం షూట్ ఎలాంటి టెన్షన్ లేకుండా మెల్లగా కంప్లీట్ చేయనున్నారట.అలాగే గ్రాండ్ గా కూడా తెరకెక్కిస్తున్నారని సమాచారం.

మొత్తానికి పుష్ప 2 షూట్ ఎంత పూర్తి అయ్యింది అనే సమాచారం అయితే క్లారిటీగా తెలుస్తుంది.

కాగా ఇందులో హీరోయిన్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు జోడీగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్( Mythri Movie Makers ) గ్రాండ్ నిర్మాణ విలువలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ఎండ్ అవుతుందో.

రిలీజ్ తర్వాత ఎన్ని అంచనాలు క్రియేట్ చేస్తుందో.

వీళ్లకు వేరే సినిమాల వల్లే హిట్ సినిమాల్లో ఛాన్సెస్ వచ్చాయి..?
Advertisement

తాజా వార్తలు