పుష్ప ది రూల్ ఫస్ట్ డే టార్గెట్ అన్ని రూ.కోట్లా.. ఆ తప్పు మాత్రం మైనస్ కానుందా?

పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ రిలీజ్ కు కేవలం 5 రోజుల సమయం మాత్రమే ఉంది.

దాదాపుగా 200 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది.

నిడివి ఎక్కువగా ఉండటంతో మూడున్నర గంటల పాటు థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది.ఈ విధంగా చేయడం వల్ల రోజులో ఒక షో ఆదాయాన్ని పుష్ప2 కోల్పోవాల్సి వస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సింగిల్ స్క్రీన్స్ , మల్టీప్లెక్స్ లలో నిడివి ప్రభావం ఎక్కువగానే ఉండనుంది.ఒకవేళ నిడివి ఎక్కువగా ఉండటం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలైతే కూడా సినిమాకు ఇబ్బందేనని చెప్పవచ్చు.

మరీ ఎక్కువ సమయం పాటు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టడం సులువైన టాస్క్ అయితే కాదు.మరోవైపు పుష్ప ది రూల్ ఫస్ట్ డే కలెక్షన్లు( First Day Collections ) 200 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశం అయితే ఉంది.

Advertisement
Pushpa The Rule Movie First Day Collections Target Details, Pushpa, Pushpa The R

తెలంగాణలో మరీ భారీ స్థాయిలో టికెట్ రేట్ల( Pushpa 2 Ticket Rates ) పెంపు ఉండకపోవచ్చు.

Pushpa The Rule Movie First Day Collections Target Details, Pushpa, Pushpa The R

ఏపీలో మాత్రం టికెట్ రేట్ల పెంపు ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.మైత్రీ బ్యానర్ లో పవన్ ఇప్పటికే ఒక సినిమాలో నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాకు టికెట్ రేట్ల పెంపు సమస్య కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పుష్ప ది రూల్ సినిమాకు భారీగా టికెట్ రేట్ల పెంపు ఉంటే ఈ సినిమా కలెక్షన్లు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది.

పుష్ప ది రూల్ సెకండాఫ్ లో యాక్షన్ కు ఎక్కువగా ఓటేశారని సమాచారం అందుతోంది.

Pushpa The Rule Movie First Day Collections Target Details, Pushpa, Pushpa The R

పుష్ప ది రూల్ మూవీ టాలీవుడ్ రేంజ్ ను ఏ రేంజ్ లో పెంచుతుందో చూడాల్సి ఉంది.పుష్ప ది రూల్ మూవీ రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసిందని తెలుస్తోంది.బన్నీ ప్రమోషన్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 23 బుధవారం, 2020

విడుదలకు ముందే ఎన్నో రికార్డ్స్ ను క్రియేట్ చేసిన ఈ మూవీ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు