పుష్ప టీమ్ స్పెల్లింగ్ మార్పుపై సోషల్ మీడియా ట్రోల్స్‌

అల్లు అర్జున్‌.సుకుమార్‌ ల కాంబో లో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది.

విడుదల తేదీ అదుగో ఇదుగో అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు జరుపుతూ వచ్చి ఎట్టకేలకు వచ్చే నెల లో విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు.డిసెంబర్ 17 న విడుదల కాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమాను సుకుమార్‌ భారీ ఎత్తున తెరకెక్కించాడు.విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయం లో చిత్ర యూనిట్‌ సభ్యులు రివీల్‌ చేస్తున్న పోస్టర్ లు మరియు వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

సుకుమార్ గత చిత్రంలో రంగతమ్మత్త పాత్రలో కనిపించిన అనసూయ పుష్ప సినిమాలో దాక్షయని పాత్రలో కనిపించబోతుంది.

Advertisement

దాక్షయని గా అనసూయ లుక్‌ కు అంతా ఫిదా అవుతున్నారు.ఆమె హెయిర్‌ స్టైల్‌ మరియు ఇతర లుక్ చాలా బాగుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లుగా లుక్ ను చూస్తుంటే క్లీయర్ గా అర్థం అవుతోంది.

ఇక అనసూయ పాత్ర పేరు విషయం లో చిత్ర యూనిట్‌ సభ్యులు నిన్న ఒక విధంగా నేడు ఒక విధంగా చెప్పడం విమర్శ లకు తెర తీసింది.  నిన్న drakshayini (ద్రాక్షయిని) అంటూ అనసూయ లుక్ ను రివీల్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు.

కాని నేడు మాత్రం dakshayani (దాక్షయని) అనే అర్థం వచ్చేలా మార్చారు.రెండు అక్షరాలను మార్చడం ద్వారా పేరు అర్థం చాలా మారుతుంది.మరి ఇది టెక్నికల్‌ మిస్టేక్‌ అయ్యి ఉంటుందా లేదంటే ఏదైనా అర్థం ఇందులో ఉందా అనేది తెలియాల్సి ఉంది.

కాని ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021
Advertisement

తాజా వార్తలు