బన్నీ పక్కన ఉన్న ఈ బ్యూటీ ఎవరో మీకు తెలుసా.. ఈమె టాలెంట్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

అల్లు అర్జున్( Allu Arjun ) హీరోగా నటించిన పుష్ప సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

ఇప్పటికే ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది.

ఇకపోతే గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ గా మారిన విషయం తెలిసిందే.ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాను ఈ వీడియో ఒక ఊపు ఊపేస్తోందని చెప్పాలి.

ఆ వీడియో మరేదో కాదు పుష్ప టు సినిమాలో ఒక సాంగ్ మేకింగ్ కి సంబంధించిన వీడియో.అందులో అల్లు అర్జున్ ఆ పింక్ కలర్ అవుట్ ఫిట్ లో అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేస్తూ మెస్మరైజింగ్ లుక్ లో ఆకట్టుకుంది.

Pushpa 2s Assistant Choreographer Urvashi Apsaras Dancing Video With Allu Arjun

పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ ( Kissik Song )మేకింగ్ సందర్భంగా ఐకాన్ స్టార్‌తో కలిసి ఈ బ్యూటీ చేసిన డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియో నెటిజన్లకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది.దీంతో ఎవరీ అమ్మాయి? ఇన్‌స్టా ఐడీ ఇస్తే లైఫ్ ఇస్తాం అంటూ తెగ కామెంట్స్ పెడుతున్నారు.ఇక మనవాళ్లు ఆగుతారా,ఆమె ఇన్ స్టా ఐడీతో పాటు పుట్టు పూర్వోత్తరాలు ఇలా అన్ని కనిపెట్టేశారు.

Advertisement
Pushpa 2s Assistant Choreographer Urvashi Apsaras Dancing Video With Allu Arjun

ఆ వీడియోలో బన్నీ పక్కన డాన్స్ చేసిన అమ్మాయి పేరు చెప్పండి అంటూ కామెంట్స్ చేసిన నెటిజన్స్ చివరికి అయ్యే పని కాదని మొత్తం ఆమె గురించి వివరాలన్నీ తెలిసేసికున్నారు.బన్నీ పక్కన డ్యాన్స్ చేసిన అమ్మాయి పేరు ఊర్వశి అప్సర( Urvashi Apsara ).

Pushpa 2s Assistant Choreographer Urvashi Apsaras Dancing Video With Allu Arjun

ఈమె పుష్ప 2 చిత్రానికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ గా పని చేసింది.థియేటర్లో ఒక ఊపు ఊపేస్తున్న కిస్సిక్ సాంగ్‌ కి ఈమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. అంటే సాంగ్ కొరియోగ్రఫి చేసిన గణేశ్ ఆచార్య మాస్టర్ ( Ganesh Acharya )వద్ద తను అసిస్టెంట్‌ గా చేస్తోంది.

ఇప్పుడు కొత్తేం కాదు పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా పాటకి కూడా ఈమె వర్క్ చేసిందట.ఊర్వశీ బెల్లి డ్యాన్స్‌ లో ఎక్స్‌పర్ట్.అంతేకాదు, యోగా ట్రైనర్ కూడా నట.నటిగా కూడా పలు సినిమాల్లో మెరిసింది.31 డిసెంబర్, కిట్టి పార్టీ ,అనంత్, పింటు కి పప్పి వంటి మూవీస్‌ లో నటించింది.చాలామంది సెలబ్రెటీలతో కలిసి పనిచేసింది.

సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో కుర్రాకారుకు సెగలు రేపుతోంది ఈ బ్యూటీ.అయితే అంతకుముందు ఆమె పలు సినిమాలలో నటించి తన సినిమాలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

కానీ అల్లు అర్జున్ తో ప్రాక్టీస్ కి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిపోయింది.ఆమె వీడియో చూసిన కొందరు.

Advertisement

అసలు ఈమెతోనే ఆ కిస్సిక్ సాంగ్ చేయిస్తే నెక్ట్స్ లెవల్‌ కదా అని కామెంట్స్ పెడుతున్నారు.మొత్తానికి ఒక్క మేకింగ్ వీడియోతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

కొందరు శ్రీ లీలా కంటే ఈమెనే బాగుంది ఐటెం సాంగ్ చేయించి ఉంటే ఇంకో లెవెల్ లో ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు