అల్లు అర్జున్,( Allu arjun ) సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి మనందరికీ తెలిసిందే.2021 లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు కోటలో కలెక్షన్స్ ని సాధించింది.
అంతేకాకుండా అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది.
ఈ సినిమాకు గాను నేషనల్ అవార్డు కూడా వచ్చిన తెలిసిందే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉత్తమ నటుడిగా మొట్టమొదటి అవార్డు అందుకున్న హీరోగా అల్లు అర్జున్ నిలిచారు.
ఇక ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పుష్ప 2 సినిమా( pushpa 2 )ను రూపొందిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే పుష్ప పార్ట్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.వచ్చే ఏడాది అనగా 2024 మార్చి 22వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే మార్చి 22 శుక్రవారం వచ్చింది.ఆ తర్వాత వీకెండ్ మూవీకి హెల్ప్ అవుతుంది.ఆ తర్వాత వెంటనే హోలీ, ఆ తర్వాత వెంటనే గుడ్ ఫ్రైడ్ వరసగా వస్తున్నాయి.
ఇవి సెలవు దినాలు అవ్వడంతో మూవీకి ప్లస్ అవుతాయి.అక్కడితో అయిపోలేదు.
ఆ తర్వాత మళ్లీ వీకెండ్ ఉంది.వెంట వెంటనే రెండు, మూడు రోజుల గ్యాప్ లో ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి వంటి పండగలు క్యూలో ఉన్నాయి.
దాంతో ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఈ వార్త సోషల్ మీడియాలో వరలవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పటికే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఫ్యాన్స్ తాజాగా ఈ వార్త వినిపించడంతో మరింత సెలబ్రేట్ చేసుకుంటున్నారు.మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే మూవీ మేకర్స్ స్పందించేంత వరకు వేచి చూడాల్సిందే మరి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy