ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మందన్న (Rahsmika Mandanna) హీరోయిన్ గా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో పార్ట్ 2 ను మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 1 భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో ఈసారి మరింత బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు సంపాదించు కున్నాడు.ఇక ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ లో నటిస్తున్నాడు.
ఈ సీక్వెల్ తో మరింత గ్రాండ్ హిట్ అందుకుని పాన్ ఇండియా మాత్రమే కాకుండా పాన్ వరల్డ్ వైడ్ గా తన స్థాయిని పెంచుకోవాలని ఇంకొంచెం కష్టపడుతున్నాడు.పుష్ప ది రూల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ మధ్యనే జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.మరి షూట్ చేస్తున్న ఈ సినిమా నుండి అదిరిపోయే ట్రీట్ రాబోతుంది అని తెలుస్తుంది.పుష్ప 2 అప్డేట్ కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.
పాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే (Allu Arjun Birthday) కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ చేయనుందని తెలుస్తుంది.
ఇక ఇది కూడా చాలా వినూత్నంగా కొత్తగా చేయాలని సుక్కూ భావిస్తున్నారట.ఈ టీజర్ గురించి తాజాగా వైరల్ అవుతున్న బజ్ ఏంటంటే.ఈ ఫస్ట్ లుక్ టీజర్ (Pushpa 2 Teaser) తో సుకుమార్ ఒక కొత్త ప్రయోగం చేయబోతున్నారట.
అది ఏంటంటే.వీడియో మొత్తం కేవలం హీరో మీదనే డిఫరెంట్ స్టైల్ లో పలు ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ను జోడించి చేయనున్నారట.
దీంతో ఈ అప్డేట్ ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ అంత ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy