జనగణమన కోసం ఏ.ఆర్.రెహమాన్..!

లైగర్ తర్వాత పూరీ జగన్నాథ్ మళ్లీ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతోనే మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు.

మహేష్ తో చేయాల్సిన జన గణ మన సినిమాను విజయ్ దేవరకొండతో చేసే ప్లాన్ లో ఉన్నాడు పూరీ జగన్నాథ్.

సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా అకాడమీ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.పూరీ డైరక్షన్ లో రెహమాన్ మ్యూజిక్ సినిమా ఈ కాంబో ఫిక్స్ అయితే సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు ఆడియెన్స్.

Puri Vijay Jana Gana Mana Music Composer Finalised , Ar Rahman, Jana Gana Mana,

జన గణ మన సినిమా కథ మహేష్ కోసం రాసుకున్న పూరీ ఇన్నాళ్లు మహేష్ ఓకే చెబుతాడని ఎదురుచూశాడు.అయితే లైగర్ తో విజయ్ తో ఏర్పడిన ర్యాపో వల్ల ఆ సినిమాను విజయ్ తో తీయాలని ఫిక్స్ అయ్యాడట పూరీ జగన్నాథ్.

లైగర్ తర్వాత విజయ్, పూరీ వేరు వేరుగా ఒక సినిమా చేసి మళ్లీ ఇద్దరు కలిసి సినిమా చేస్తారని అంటున్నారు.మహేష్ కి అనుకున్న కథతో విజయ్ సినిమా అంటే పూరీ ఈసారి ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టు అనుకుంటున్నారు.

Advertisement

 ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ అప్డేట్ లైగర్ రిలీజ్ తర్వాత వచ్చే ఛాన్స్ ఉందని టాక్.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు