డబుల్ ఇష్మార్ట్ నుండి అప్డేట్.. క్రేజీ వీడియోతో కన్ఫర్మ్!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇష్మార్ట్ శంకర్( Ismart Shankar ) సినిమాతో ఏ రేంజ్ హిట్ అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్( Puri Jagannadh ), రామ్ పోతినేని కాంబోలో వచ్చిన సినిమానే ఇష్మార్ట్ శంకర్.

ఈ ఇద్దరి కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అయ్యింది.వరుస ప్లాపులతో ఉన్న ఈ ఇద్దరికీ యాక్షన్ బ్లాక్ బస్టర్ వచ్చింది.

గత నాలుగేళ్ళ క్రితం ఈ సినిమా వచ్చి మాసివ్ హిట్ అందుకుంది.గత కొన్నాళ్లుగా ఈ సినిమా క్రేజీ కాంబో మరోసారి రిపీట్ అవుతుంది అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇన్నాళ్లకు ఈ కాంబో రిపీట్ అవుతుంది.ఈ విషయాన్నీ అధికారికంగా కన్ఫర్మ్ చేసేసారు.

Advertisement

ఈ ఏవైటెడ్ కాంబో పై మేకర్స్ ఇప్పుడు ఇచ్చినా సాలిడ్ అప్డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఈ ఇద్దరి కాంబోలో నెక్స్ట్ సినిమాను కన్ఫర్మ్ చేస్తూ క్రేజీ వీడియోను రిలీజ్ చేసారు.డబుల్ ఇష్మార్ట్ కాంబినేషన్ పై రేపు మీ 4న ఫుల్ ఫ్లెజ్డ్ గా మరో అప్డేట్ ఇవ్వనున్నట్టు చెప్పుకొచ్చారు.మరి ఈ కాంబోలో ఇష్మార్ట్ శంకర్ 2 తెరకెక్కుతుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

చూడాలి రేపు ఎలాంటి అప్డేట్ ఇస్తారో.

ఇక మే 15న రామ్ పోతినేని ( Ram Pothineni )పుట్టిన రోజు కావడంతో ఈయన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ వస్తుంది.అలాగే రామ్ ప్రెజెంట్ నటిస్తున్న బోయపాటి సినిమా నుండి కూడా మాసివ్ అప్డేట్ ఇవ్వబోతున్నారు.బోయపాటి, రామ్ కాంబోలో RAPO20 తెరకెక్కుతుంది.

చాలా ఏళ్ళ గ్యాప్ తీసుకొని రిపీట్ అయిన హీరో-హీరోయిన్ల కాంబినేషన్లు ఏంటో తెలుసా ?

ఇక ఈ సినిమాను అక్టోబర్ 20న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు