ఆగిపోయిన జనగణమణ.. పాపం పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఈసారి కూడా అటకెక్కినట్టే!

టాలెంటెడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎన్నో సినిమాలను తెరకెక్కించాడు.టాలీవుడ్ కు చాలా సూపర్ హిట్ సినిమాలు అందించాడు.

అయితే ఇటీవలే ఈయన తెరకెక్కించిన సినిమా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది అనుకుంటే అట్టర్ ప్లాప్ అయ్యింది.పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా కోసం ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురు చూసారు.

ఆగష్టు 25న ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయ్యింది.ఇన్ని అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది.

ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులను కూడా ఏ విషయంలో సంతృప్తి పరచలేక పోయింది.రిలీజ్ అయినా అన్ని చోట్ల ప్లాప్ టాక్ రావడంతో రౌడీ స్టార్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు.

Advertisement

అయితే ఈ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై పడుతుంది.ఈ సినిమా తర్వాత కూడా విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోనే రెండవ సినిమా చేస్తున్నాడు.

లైగర్ రిలీజ్ కాకుండానే జనగణమణ ప్రకటించి ఫస్ట్ షెడ్యూల్ కూడా కొద్దిగా ముగించారు.

పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా జనగణమన సినిమా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది.ఇక ఇప్పుడు వీరిద్దరి కాంబోలో లైగర్ భారీ డిజాస్టర్ అవ్వడంతో ఈ సినిమా వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.లైగర్ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన పూరీ ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి ఇంకా కోలుకోలేదు.

ఇదే సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అయితే ఇప్పుడు జనగణమణ సినిమాకు ఎలాంటి అడ్డు ఉండక పోయేది.కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో ఇప్పుడు అంత బడ్జెట్ తో జేజిఎమ్ తెరకెక్కించాలి అంటే వర్కౌట్ అవ్వదు అని తేల్చుకోవడంతో ఈ సినిమాను వాయిదా వేసారట.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

దీంతో పూరీ డ్రీమ్ ఈసారి కూడా అటకెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.

Advertisement