Puneeth Raghavendra Rajkumar: తమ్ముడు, తమ్ముడి పిల్లల పేర్లను టాటూ వేయించుకున్న పునీత్ బ్రదర్.. గొప్పోడంటూ?

దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్( Puneeth Raj Kumar ) గురించి మనందరికీ తెలిసిందే.

పునీత్ మరణించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇంకా కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి.

పునీత్ ఆకస్మిక మరణాన్ని అభిమానులు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.కన్నడ అభిమానులు ఆయనపై ఉన్న అభిమానంతో ఇప్పటికే చాలా ప్రదేశాలలో విగ్రహాలను ఏర్పాటు చేసిన విషం తెలిసిందే.

ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లినప్పటికీ అభిమానుల మనసుల్లో బ్రతికే ఉన్నారు.

ఆయన మరణించి రెండేళ్లు కావస్తున్నా కూడా ఇప్పటికి కన్నడలో ఏ సినిమా ఈవెంట్‌ జరిగా కచ్చితంగా పునీత్‌ పేరును స్మరించుకుంటున్నారు.పునీత్‌ కుటుంబ సభ్యులు కూడా ఆయన పేరు తెరపై కనిపిస్తే కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.ముఖ్యంగా పునీత్‌ సోదరులు శివరాజ్‌ కుమార్‌, రాఘవేంద్ర రాజ్‌కుమార్‌ అయితే ప్రతి సినిమా ఈవెంట్‌లో తమ్ముడిని తలచుకుంటూ ఎమోషనల్‌ అవుతున్నారు.

Advertisement

ఇక తాజాగా తన తమ్ముడి పేరుని ఛాతిపై టాటూగా( Puneeth Tattoo ) వేయించుకున్నాడు పునీత్ అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్‌.( Raghavendra Rajkumar ) కాగా రాఘవేంద్రకు తమ్ముడు పునీత్ అంటే చాలా ఇష్టం.

తనకంటే వయసులో చాలా చిన్నవాడు కావడంతో అతన్ని సొంత కొడుకులా చూసుకున్నాడు.అయితే 46 వయసులో పునీత్‌ గుండె పోటుతో మరణించడన్ని రాఘవేంద్ర తట్టుకోలేకపోయారు.ఇప్పటికీ ఏదైనా స్టేజిపై పునీత్ ఫొటో కనిపిస్తే దుఃఖం ఆపుకోలేడు.

ఇక తన తమ్ముడిని చిరకాలం గుర్తించుకోవడం కోసం చాతిపై అప్పు అని టాటూ వేయించుకున్నాడు.ఇది పునీత్‌ ముద్దు పేరు.

అప్పుతో పాటు టోటో, నుక్కి పేర్లను కూడా పచ్చబొట్టు వేయించుకున్నాడు.అవి పునీత్‌ ఇద్దరి కుమార్తెల ముద్దు పేర్లు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...

వాళ్ల అసలు పేర్లు వందిత, ధృతి.

Advertisement

తాజా వార్తలు