జీవితమే వద్దనుకున్న వాడికి ఎదురైన ఒక మహిళ ఆ వ్యక్తిని మార్చేసింది.. ఆమె మాటలు అతడిని లక్షాధికారిని చేశాయి

జీవితంలో ప్రోత్సాహం, మంచి సలహాలు అనేవి చాలా అవసరం.కొందరు ప్రోత్సాహం, సలహాలు ఇచ్చే వారు లేక పోవడంతో సక్సెస్‌ అవ్వలేక పోతున్నారు.

అలా ఎంతో మంది తమలోని ప్రతిభను గుర్తించక పోవడం వల్ల నిరాశగా జీవితాన్ని గడిపేస్తారు.ఎప్పుడైతే వారిలోని నిరాశ పోతుందో, వారికి వారిపై నమ్మకం కలుగుతుందో లేదంటే ఎవరైనా వారికి నమ్మకాన్ని కలిగించేలా చేస్తారో అప్పుడు ఆ వ్యక్తి జీవితం మారిపోవడం ఖాయం.

అలా పూణెకు చెందిన ఒక వ్యక్తి తనలోని ప్రతిభను ఒక మహిళ ద్వారా తెలుసుకుని ఇప్పుడు లక్షాదికారి అయ్యాడు.

Pune Businessman Inspiring Life Story

పూణెకు చెందిన సాహేష్‌ డిగ్రీ పూర్తి చేసి జాబ్‌ కోసం తిరిగి తిరిగి విసిగి పోయాడు.డిగ్రి ఉన్న అతడు చిన్న ఉద్యోగం చేసేందుకు మనసు ఒప్పలేదు.పెద్ద ఉద్యోగాలు రావడం లేదు.

Advertisement
Pune Businessman Inspiring Life Story-జీవితమే వద్దను�

దాంతో 25 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా తల్లిదండ్రులకు బారం అవుతున్నాను అంటూ ఎప్పుడు ఆవేదన వ్యక్తం చేసేవాడు.ఒకరోజు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్తే అక్కడ రెండు మూడు గంటలు వెయిట్‌ చేయించి జాబ్‌ లేదు అంటూ బయటకు వెళ్లమన్నారట.

దాంతో అతడికి బాగా నిరుత్సాహం కలిగింది.ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.

Pune Businessman Inspiring Life Story

జీవితం వద్దనుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు.అలా కొద్ది దూరం ముదుకు వెళ్లిన తర్వాత ఒక మహిళతో ఒక సేల్స్‌ మెన్‌ గొడవ పడుతున్నట్లుగా అర్థం అయ్యింది.తన దారిన తాను పోయేందుకు ప్రయత్నించగా ఆ మహిళ సాహేష్‌ ను పిలిచింది.

ఆ సేల్స్‌ మన్‌ తనను మోసం చేస్తున్నాడని, తనకు తక్కువ రేటు డ్రస్‌ను ఎక్కువ రేటుకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసింది.అప్పుడు దగ్గరకు వెళ్లిన సాహేష్‌ ఆ డ్రస్‌ పట్టుకుని చూసి మూడు నాలుగు మాటలు చెప్పి ఆమె సేల్స్‌మన్‌ చెప్పిన రేటుకే తీసుకునేలా చేశాడు.

భారతీయుల పొదుపు మంత్రం – ప్రపంచానికే మార్గదర్శకం
హమ్మో, ఎగిరే కారు వచ్చేసింది.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!!

అప్పుడు నీ మాటల్లో ఏదో మాయ ఉంది బాబు అంటూ ఆ మహిళ అక్కడ నుండి వెళ్లి పోయింది.వెళ్లి పోయే ముందు నువ్వు మంచి సేల్స్‌ మన్‌, మార్కెటింగ్‌ స్కిల్స్‌ బాగా ఉన్నాయంటూ చెప్పి పోయింది.

Advertisement

ఆ మాటలతో తనకు తానే ఒక నమ్మకంను కలిగించుకుని మార్కెటింగ్‌ ఫీల్డ్‌లోకి ఎంటర్‌ అయ్యాడు.

మొదట రోడ్డు పక్కన చిన్న షాప్‌ను ప్రారంభించిన సాహేష్‌ అందులో పలు రకాల వస్తువులను అమ్మడం మొదలు పెట్టాడు.ఆ తర్వాత మెల్ల మెల్లగా ఆ షాప్‌ను విస్తరించడం వందల కొద్ది ప్రాడక్ట్స్‌ను అమ్మడం మొదలు పెట్టాడు.ప్రస్తుతం తను చిన్నపాటి షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేశాడు.

ప్రస్తుతం అతడు లక్షల్లో డబ్బు సంపాదిస్తున్నాడు.జీవితం చాలిద్దాం అనుకున్న సమయంలో ఆమహిళ ఎదురవ్వడం, ఆమె మాటలను విడిచి పెట్టకుండా ప్రయత్నించడం అనేది గొప్ప విషయం.

ప్రతి మనిషికి కూడా అలాంటి మహిళ ఏదో ఒక రూపంలో ఎదురు అవుతూనే ఉంటారు.అప్పుడు మనం గమనించి మన బలా బలాలను తెలుసుకోవాలి.

తాజా వార్తలు