అసలు పల్స్‌ ఆక్సీమీటర్‌ ఎలా పని చేస్తుందంటే..?!

పల్స్ ఆక్సీమీటర్.కరోనా వైరస్ సీజన్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు.ఇంట్లో జ్వరాన్ని పరీక్షించుకోడానికి థర్మామీటర్ ఎంత ముఖ్యమో.

వైరస్ వంటి మహమ్మారి వల్ల శరీరంలో కలిగే అంతుచిక్కని మార్పులను కనుగొనేందుకు ఈ పల్స్ ఆక్సీమీటర్ కూడా ముఖ్యమేనని అంటున్నారు.దీని ద్వారా శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించి అప్రమత్తంగా ఉండవచ్చని పేర్కొంటున్నారు.

అయితే, ఇది కేవలం వైరస్‌కు మాత్రమే కాదు.మరెన్నో అనారోగ్య సమస్యలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

మనం బతికేందుకు ఆక్సిజన్ ఎంత ముఖ్యమో తెలిసిందే.శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే ఆక్సిజన్ ఉండాలి.

Advertisement

లేనట్లయితే శరీరంలోని కణాలు అదుపు తప్పి నాశమవుతాయి.అదే జరిగితే అవయవాలు పనిచేయడం ఆగిపోయి మరణానికి దారితీస్తుంది.

మనం పీల్చే గాలి ఊపిరితీత్తుల్లోకి ఫిల్టర్ అవుతుంది.ఆ తర్వాత ఎర్ర రక్తకణాల్లో ఉండే హిమోగ్లోబిన్ ప్రోటీన్స్ ద్వారా శరీరమంతటికి ఆక్సిజన్ సరఫరా అవుతుంది.

పల్స్ ఆక్సీమీటర్లు.ఈ హిహోగ్లోబిన్‌లో ఉండే ఆక్సిజన్ శాతాన్ని లెక్కిస్తాయి.

రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నట్లయితే అప్రమత్తమై వైద్యం పొందేందుకు ఈ మీటర్లు ఉపయోగపడతాయి.ఈ పరికరాన్ని ‘పల్స్ ఆక్స్’ అని కూడా పిలుస్తారు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇది చిన్న క్లిప్ తరహాలో ఉంటుంది.దీన్ని చేతి వేలు గోరు పైభాగానికి పెట్టుకోగానే సెకన్ల వ్యవధిలో ఇది రీడింగులను చూపిస్తుంది.

Advertisement

ఆరోగ్యవంతుల్లో ఆక్సిజన్ శాతం 95 నుంచి 99 శాతం ఉంటుంది.ఇది మీ వేలిలోని రక్తకేశ నాళికల్లోకి పరారుణ(ఇన్‌ఫ్రారెడ్) కిరణాలను పంపుతుంది.

అందులో ప్రతిబింబించే కాంతి ద్వారా ఆక్సిజన్ శాతాన్ని కొలుస్తుంది.ఇది SpO2 అనే ఇది సంతృప్త రక్తం శాతాన్ని చూపిస్తుంది.

ఆక్సిమీటర్ హృదయ స్పందన రేటును కూడా చూపిస్తుంది.ఆక్సీమీటర్‌ ను ఎక్కువగా చూపుడు వేలుకు పెట్టుకుంటారు.

అయితే, మీరు మధ్య వేలుకు సైతం పెట్టుకుని రీడింగ్ తీసుకోవచ్చు.పల్స్ ఆక్సీమీటర్ 98 శాతం ఖచ్చితమైన రీడింగ్ ఇస్తుందని, లోపం కేవలం 2 శాతమేనని నిపుణులు చెబుతున్నారు.

కాబట్టి.అది చూపించే రీడింగ్‌లో రెండు శాతం ఎక్కువ లేదా తక్కువగా భావించాలి.

దీన్ని కొనుగోలు చేయాలా లేదా అనేది మీ ఆరోగ్యం, మీ ప్రాంతంలో వైరస్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.దీన్నీ ఉపయోగించాలనే నిర్ణయం తీసుకోడానికి ముందు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలి.

మీ ఆరోగ్య పరిస్థితికి ఆక్సీమీటర్ ఎంతవరకు ఉపయోగపడుతుందో కూడా తెలుసుకోవాలి.ఎందుకంటే.

ఆరోగ్యవంతులకు ఈ మీటర్‌తో పెద్దగా పని ఉండదు.ప్రస్తుతం వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో దీని వాడకం పెరిగింది.

ఈ పరికరం ఎలాంటి నొప్పి కలిగించదు.సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

కాబట్టి సులభంగానే వాడవచ్చు.

తాజా వార్తలు