డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్

బ్యాడ్మెంటన్ స్టార్, కోచ్ పుల్లెల గోపీచంద్ గురించి ఇండియాలో ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

బ్యాడ్మెంటన్ క్రీడాకి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు ప్రపంచ స్థాయిలో బ్యాడ్మెంటన్ అంటే ఇండియా పేరు వినిపించేలా చేసిన ఘనత అతని సొంతం.

హైదరాబాద్ వేదికగా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎంతో మంది మెరికల్లాంటి క్రీడాకారులని తయారు చేస్తున్నారు.పివి సింధూ, సైనా నెహ్వాల్ లాంటి ఇండియన్ బ్యాడ్మెంటన్ స్టార్స్ అందరూ గోపీచంద్ అకాడమీ నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించారు.

Pullela Gopichand Biopic Going On Sets In December, Sudheer Babu, Praveen Sattar

క్రికెట్ తో స్థాయిలో ఇండియాలో ఇప్పుడు ఈ క్రీడకి కూడా గుర్తింపు ఉంది.కోచ్ కంటే ముందు ఇండియా తరుపున ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్ షిప్ సొంతం చేసుకున్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.

ఇదిలా ఉంటే పుల్లెల గోపీచంద్ జీవిత కథని తెరపై ఆవిష్కరించేందుకు హీరో సుధీర్ బాబు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు.సుధీర్ బాబు గోపీచంద్ మంచి ఫ్రెండ్స్ అనే విషయం చాలా మందికి తెలుసు.

Advertisement

సుధీర్ బాబు కూడా జాతీయ స్థాయిలో బ్యాడ్మెంటన్ క్రీడాకారుడుగా గుర్తింపు తెచ్చుకొని తరువాత సినిమాలలోకి అడుగు పెట్టాడు.ఈ నేపధ్యంలో పుల్లెల గోపీచంద్ బయోపిక్ కోసం చాలా కాలంగా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇక ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది అని ప్రచారం జరిగింది.దీనిపై స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయింది.

అయితే ఎందుకనో షూటింగ్ స్టార్ట్ కాలేదు.అయితే తాజాగా సుధీర్ బాబు ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చాడు.

డిసెంబర్ లో గోపీచంద్ బయోపిక్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని స్పష్టం చేశాడు.అయితే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఉంటుందా, లేదంటే వేరొక దర్శకుడుతో సెట్స్ పైకి వెళ్తారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

టూత్ పేస్ట్ పళ్లకే కాదు.. ఇలా కూడా వాడొచ్చు!!
Advertisement

తాజా వార్తలు