జూనియర్ ఎన్టీఆర్ ను అలా పిలవడం నాకు అస్సలు నచ్చదు: పృథ్వీ రాజ్ 

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్( NTR )ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నారు.

ఈయన రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఆర్ఆర్ఆర్ ( RRR ) సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇక ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈయనకు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే ఎన్టీఆర్ నటించిన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

ఇక ఎన్టీఆర్ తన సినిమా పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన గురించి మాత్రం సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే.తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ మామ అయినటువంటి చంద్రబాబు( Chandra Babu ) అరెస్ట్ కావడంతో ఇప్పటికే పలువురు టిడిపి నేతలు నందమూరి కుటుంబ సభ్యులు కార్యకర్తలు కూడా స్పందించారు.అలాగే సినీ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై స్పందించి వారి అభిప్రాయాలను తెలియజేశారు.

Advertisement

అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ ఈ విషయంపై స్పందించకపోవడంతో ఆయన గురించి చాలా విమర్శలు వస్తున్నాయి.

ఇక తాజాగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఎంతో ఫేమస్ అయినటువంటి పృథ్విరాజ్ ( Pruthvi Raj ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ విషయం గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.ఎన్టీఆర్ ఈ విషయం గురించి ఇప్పుడు మౌనంగా ఉండవచ్చు అయితే టిడిపిలో పెద్దలు ఉన్నారు అన్న కారణంతోనే ఆయన ఈ విషయంపై మాట్లాడలేదని,స్పందించాల్సిన సమయంలో తప్పకుండా స్పందిస్తారు అంటూ వెల్లడించారు.ఇక ఆయన ఇప్పుడు మాట్లాడకపోయినా భవిష్యత్తులో ఏదైనా ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందంటూ ఈయన తెలిపారు.

ఇక ఎన్టీఆర్ ను అందరూ ఎన్టీఆర్ అని పిలుస్తారు.నాకు మాత్రం ఆయనని అలా పిలవడం ఏమాత్రం నచ్చదని తనని నందమూరి తారక రామారావు ( Taraka Ramarao ) అని పిలిస్తేనే నచ్చుతుంది అంటూ ఈ సందర్భంగా పృథ్విరాజ్ వెల్లడించారు.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ లేకుండా డాకు మహారాజ్ హిట్టవుతుందా.. ఆ రేంజ్ కలెక్షన్లు వస్తాయా?
Advertisement

తాజా వార్తలు