మీడియా నా పేరును బాగా వాడుకుంటుంది : దిల్ రాజు

ప్రెసెంట్ మన టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి అంతగా అనుకూలంగా లేదు అనే చెప్పాలి.

అలా అని సినిమాలు హిట్ అవ్వడం లేదు అని చెప్పడం లేదు కానీ.

సినిమా ఎంత హిట్ అయినా.ఓపెనింగ్స్ బాగానే వచ్చిన ఆ తర్వాత మాత్రం అనుకున్నంత స్థాయిలో కలెక్షన్స్ రావడం లేదు.

దీంతో ఈ పరిస్థితులు చక్కబడే వరకు కొద్దీ రోజులు షూటింగులు వాయిదా వేయాలని స్వచ్చంధంగా నిర్ణయం తీసుకున్నారు.నిర్మాతలు అంతా సమ్మె బాట పట్టడంతో సమస్యల పరిష్కారానికి సినీ పెద్దలు మొత్తం ఫిలిం ఛాంబర్ లో సమావేశం అయ్యారు.

ఆగష్టు 1 నుండి షూటింగులు నిలిపి వేయడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రత్యేక సమావేశం అయ్యి సమస్యల పరిష్కారం కోసం చర్చించారు.ఆ సమావేశం అనంతరం మీడియా ముందుకు సినీ ప్రముఖులు వచ్చారు.

Advertisement

ఈ క్రమంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయ్యాయి.దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ.

.సినీ కార్మికుల వేతనాలు, వీపీఎఫ్ చార్జీలు, ఓటిటి, రెవిన్యూ పర్శంటేజీ, నిర్మాణ వ్యయాలపై నాలుగు కమిటీలు పని చేస్తున్నాయని తెలిపారు.అలాగే తాను కేవలం సినిమాల కోసమే పని చేస్తానని.

వ్యక్తిగత ఎజెండాలు లాంటివి ఏమీ లేవని.మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ ఇష్టమొచ్చినట్టు నా పేరును వాడుకుంటూ వార్తలు రాసేస్తున్నారని.

సంచలన వ్యాఖ్యలు చేసాడు.ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 13 , శుక్రవారం , 2023

అందరు నాపైనే ఎక్కువ బాధ్యతలు పెట్టి అన్నిటిలోను వర్క్ చేయిస్తున్నారు.అందరి సపోర్ట్ తో నేను సినిమా కోసం మాత్రమే పని చేస్తున్న.నా పేరును వాడుతూ రకరకాల న్యూస్ రాసిన నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.

Advertisement

సినిమా గురించి రాయండి.కానీ వ్యక్తుల గురించి రాయకండి.

తెలుగు సినిమా ఎలా ఉండాలి అనే దానిపై మేమంతా పని చేస్తున్నాం.త్వరలోనే మీకు రిజల్ట్ కూడా కనిపిస్తుంది అంటూ తెలిపారు దిల్ రాజు.