చరణ్ పుట్టినరోజున ఫ్యాన్స్ కు ఆ గ్లింప్స్ లేనట్టేనా.. ఈ సమస్య వల్లే ఇబ్బంది ఎదురైందా?

టాలీవుడ్ హీరో రామ్ చరణ్( Ram Charan ) గురించి మనందరికీ తెలిసిందే.

రామ్ చరణ్ చివరగా గేమ్ చేంజర్( Game Changer ) మూవీతో పేక్షకులను పలకరించారు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.ఇకపోతే ఆ సంగతి పక్కన పెడితే చెర్రీ ఫ్యాన్స్ ఇప్పుడు ఒక సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

పెద్ది( Peddi ) అనే వర్కింగ్ టైటిల్ తో స్పోర్ట్స్ డ్రామా ఈ సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు తెరమీదకి వస్తుందా అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Problems On Ram Charan Glimpse Details, Ram Charan Problems, Ram Charan,ram Char

ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లను రామ్ చరణ్ బర్త్ డే( Ram Charan Birthday ) సందర్భంగా గ్లింప్స్ విడుదల చేస్తారని, టైటిల్ అనౌన్స్ చేస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్నారు.కానీ చెర్రీ బర్త్డే కి అలాంటి అప్డేట్లు వచ్చే సూచనలు ఏవి కనిపించడం లేదు.గ్లింప్స్ కట్ చేయడం పెద్ద సమస్య కాదు దర్శకుడు బుచ్చిబాబుకు.

Advertisement
Problems On Ram Charan Glimpse Details, Ram Charan Problems, Ram Charan,ram Char

ఆ మేరకు వర్క్ చేసారు.కానీ దానికి అద్భుతమైన బ్యాక్ గ్రవుండ్ స్కోర్ కావాలి.

ఈ రోజుల్లో అదే అసలు కీలకం అన్న విషయం తెలిసిందే.కానీ సంగీత దర్శకుడు రెహమాన్ ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో ఉన్నారు.

కొన్ని రోజులు క్రితం లైట్ గా స్ట్రోక్ వచ్చి ఆసుపత్రిలో చేరారు.ఆరోగ్యంగా డిశ్చార్జి కూడా అయ్యారు.

Problems On Ram Charan Glimpse Details, Ram Charan Problems, Ram Charan,ram Char

కానీ ప్రస్తుతం స్ట్రెయిన్ తీసుకుని వర్క్ చేసే పరిస్థితిలో లేరు.ప్రస్తుతం రెస్ట్ లో వున్నారు.అందువల్ల ఇప్పుడు గ్లింప్స్ విడుదల చేయాలన్నా కూడా సమస్య అవుతుంది.

కోలీవుడ్ హీరోతో చరణ్ మల్టీస్టారర్ మూవీ... ఖుషి అవుతున్న మెగా ఫాన్స్! 
జనతా గ్యారేజ్ సీక్వెల్ పై మోహన్ లాల్ కామెంట్స్... మౌనం పాటిస్తున్న తారక్! 

అందుకే ప్రస్తుతానికి గ్లింప్స్ విడుదలను వాయిదా వేస్తునట్లు తెలుస్తోంది.ఈ సినిమాను వీలైనంత తొందరగా పూర్తి చేసి విడుదల చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్.

Advertisement

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలా వరకు షూటింగ్ పూర్తి అయినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు