ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సమస్య.. రద్దైన వేల విమానాలు

భారీ వర్షాలు పడే సమయంలో వాతావరణం( weather ) అనుకూలించపోవడం వల్ల విమానాలను రద్దు చేయడం లేదా విమానాలను నిలిపివేయడం మనం చూస్తూ ఉంటాం.

తాజాగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌లో సమస్య వల్ల వేల విమానాలు రద్దు అయ్యాయి.

ఈ ఘటన యూకేలో చోటుచేసుకుంది.ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల వేల విమానాలు రద్దు అయ్యాయి.

వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అలాగే వేరే దేశాల నుంచి యూకేకు రావాల్సిన విమానాలు కూడా ఆగిపోవడంతో చాలామంది విదేశాల్లోనే చిక్కుకుపోయారు.

Problem In Air Traffic Control Thousands Of Canceled Flights , Aeroplanes Proble

అయితే గంట సేపటి తర్వాత పరిస్థితి చక్కబడటంతో మళ్లీ విమానాలు నడిచాయి.ఈ సాంకేతిక సమస్య వల్ల ఎయిర్ పోర్టులు, విమానయాన సర్వీసుల్లో( Airports , airlines ) జాప్యం జరుగుతోంది.కొన్ని రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగవచ్చని విమానయానశాఖ చెబుతోంది.

Advertisement
Problem In Air Traffic Control Thousands Of Canceled Flights , Aeroplanes Proble

సాంకేతిక సమస్, విమాన రాకపోకల్లో జాప్యం గురించి హీత్రూ విమానాశ్రయం ఒక ప్రకటన విడుదల చేసింది.విమాన సర్వీస్ షెడ్యూల్( Flight service schedule ) అమల్లో అంతరాయం ఏర్పడటం వల్ల మంగళవారం టికెట్లు బుక్ చేసుకున్నవారు ఎయిర్ పోర్ట్‌కు బయల్దేరే ముందు విమానయాన సంస్థను సంప్రదించాలని స్పష్టం చేశారు.

Problem In Air Traffic Control Thousands Of Canceled Flights , Aeroplanes Proble

అయితే గాట్విక్ ఎయిర్‌పోర్టు( Gatwick Airport ) మంగళవారం సాధారణ షెడ్యూల్ లో విమానాలను నడపాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.విమానాల స్టేటస్ ను ఎయిర్ లైన్స్ వద్ద కన్పామ్ చేసుకుని బయలుదేరాలని సూచిస్తుంది.తొలుత యూకేలోని నాట్స్ ఆటోమేటేడ్ ఫ్లైట్ ప్లానింగ్ సిస్టమ్ లో సమస్యను గుర్తించింది.

ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఇది మొరాయించడం వల్ల విమానాల షెడ్యూల్ ఆటోమేటిక్ వ్యవస్థలో సమస్యలు వచ్చాయి.దీని కారణంగా సిబ్బంది మాన్యువల్ గా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

లోపం గుర్తించిన వెంనటే సరిచేసినట్లు నాట్స్ తెలిపింది.

టికెట్స్ వివాదం : సీనియర్ ఎన్టీఆర్ సమయంలోను ఇదే గొడవ.. దాసరికి ఏం జరిగిందో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు