పిల్లల ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయని ఎన్టీఆర్.. కారణమిదే..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో కొంతమంది హీరోలు తమ పిల్లల ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పిల్లల ఫోటోలను షేర్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడరు.

అరుదుగా మాత్రమే వాళ్ల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు.అయితే ఎన్టీఆర్ ఈ విధంగా చేయడం వెనుక అసలు కారణాన్ని పీఆర్వో మహేష్ కోనేరు వెల్లడించారు.

జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలను మీడియాకు, పబ్లిక్ కు దూరంగా ఉంచుతారని ఆయన అన్నారు.ఎన్టీఆర్ సినిమా ఫంక్షన్లకు కూడా ఆయన పిల్లలు ఎక్కువగా రారని మహేష్ కోనేరు తెలిపారు.

ఎన్టీఆర్ పెద్దకొడుకు అభిరామ్ కు మొహమాటం, సిగ్గు కొంచెం ఎక్కువని కామ్ గా అస్సలు అల్లరి చేయకుండా ఉంటాడని తెలిపారు.ఎన్టీఆర్ చిన్నకొడుకు భార్గవ్ రామ్ మాత్రం అభిరామ్ కు పూర్తి రివర్స్ అని పేర్కొన్నారు.

Advertisement
Pro Mahesh Koneru About Jr Ntr Sons Abhiram And Bhargav Ram , Abhiram , Bhargav

భార్గవ్ రామ్ ఒక్కచోట కూడా కుదురుగా ఉండడని తండ్రి ఏ విధంగా ఉంటాడో అదే విధంగా చురుకుగా ఉంటాడని మహేష్ కోనేరు తెలిపారు.

Pro Mahesh Koneru About Jr Ntr Sons Abhiram And Bhargav Ram , Abhiram , Bhargav

అభిరామ్, భార్గవ్ రామ్ ఒకరి కంపెనీని మరొకరు బాగా ఎంజాయ్ చేస్తారని మహేష్ కోనేరు పేర్కొన్నారు.ఎన్టీఆర్ పిల్లలకు వీలైనంత ఎక్కువ టైమ్ కేటాయించే ప్రయత్నం చేస్తారని పేర్కొన్నారు.ఎన్టీఆర్ పిల్లల వీడియోలను షేర్ చేయకపోవడానికి రీజన్ చెబుతూ పిల్లల బాల్యంపై స్టార్ డమ్ ప్రభావం చుపకూడదని ఎన్టీఆర్ భావిస్తారని మహేష్ కోనేరు అన్నారు.

అందువల్లే పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎన్టీఆర్ ఎక్కువగా షేర్ చేయరని మహేష్ కోనేరు తెలిపారు.మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కరోనా సోకడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.

ఇటీవల ఎన్టీఆర్ తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కరోనా నుంచి కోలుకుంటున్నానని వెల్లడించారు.ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు