ఒకే ఒక్క సెంచరీ.. ఏకంగా అరడజన్ రికార్డ్స్ బ్రేక్ చేసిన ప్రియాంశ్ ఆర్య

ఐపీఎల్( IPL ) వంటి అత్యంత ప్రజాధారణ ఉన్న టోర్నీలో శతకం సాధించడం అంటే ఓ గొప్ప విశేషం.

బ్యాటర్ అద్భుతంగా ఆడుతున్నప్పుడే అతి తక్కువ బంతుల్లో శతకాన్ని నమోదు చేయగలుగుతాడు.

ఒక్క శతకం టీమ్ విజయం మీద ఎంతటి ప్రభావం చూపిస్తుందో ఎన్నో మ్యాచ్‌లు ఇప్పటికే రుజువు చేశాయి.అలాంటి ఓ మెరుపు శతకాన్ని మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్ జట్టు యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య ( Priyansh Arya )నమోదు చేశాడు.

మంగళవారం రాత్రి మొహాలీలో ( Mohali )జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది అన్ క్యాప్డ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్య మెరుపు ఇన్నింగ్స్.

కేవలం 42 బంతుల్లో ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సుల సహాయంతో 103 పరుగులు చేసి మొదటి ఐపీఎల్ సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు.

Priyansh Arya Broke Half A Dozen Records With Just One Century., Ipl 2025, Priy
Advertisement
Priyansh Arya Broke Half A Dozen Records With Just One Century., IPL 2025, Priy

ఇక ప్రియాంశ్ ఆర్య ఈ సెంచరీతో పాటు ఆరు రికార్డులు కూడా నమోదు చేశాడు.ఇక ప్రియాంశ్ ఆర్య( Priyansh Arya ) నెలకొల్పిన ఆరు రికార్డుల విశేషాలేంటంటే.39 బంతుల్లో శతకం చేయడం భారత్ బ్యాటర్లలో రెండో వేగవంతమైన శతకం.ఇది వరకు యూసుఫ్ పఠాన్ 2010 ఐపీఎల్ లో కేవలం 37 బంతుల్లో శతకం సాధించాడు.

ఇక మరొక రికార్డ్ చూస్తే.ఐపీఎల్ చరిత్రలో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా వేగవంతమైన శతకం సాధించాడు.

ఇదివరకు రజత్ పాటిదార్ రికార్డు (49 బంతులు) 2022 లో ఉండగా దానిని అధిగమించి రికార్డ్ సృష్టించాడు.మొత్తంగా ఐపీఎల్‌లో శతకం చేసిన 8వ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ గా నిలిచాడు.

Priyansh Arya Broke Half A Dozen Records With Just One Century., Ipl 2025, Priy

అలాగే పంజాబ్ తరపున రెండవ వేగవంతమైన శతకం నమోదు చేసాడు.ఇదివరకు డేవిడ్ మిల్లర్ ( David Miller )2013లో 38 బంతుల్లో శతకం తర్వాత ప్రియాంశ్‌ ఇప్పుడు 39 బంతుల్లో సాధించాడు.ఇక ఈ శతకం ఐపీఎల్ చరిత్రలో ఐదో వేగవంతమైన శతకంగా నిలిచింది.

ఇది వరకు క్రిస్ గేల్ (30 బంతులు), యూసుఫ్ పఠాన్ (37), మిల్లర్ (38), ట్రావిస్ హెడ్ (39) ఉండగా ఇప్పుడు వీరితో పాటు ప్రియాంశ్ కూడా చేరాడు.అంతే కాకుండా చెన్నైపై వేగవంతమైన శతకంగా కొత్త రికార్డు సృష్టించాడు.

Advertisement

అలాగే ఐపీఎల్‌లో మొదటి బంతికే సిక్స్ కొట్టిన నాల్గో ఆటగాడుగా రికాదులకు ఎక్కాడు.ఈ విజయం పంజాబ్ జట్టుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.

తాజా వార్తలు