తెలంగాణకు మరోసారి ప్రియాంక గాంధీ రాక..!

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ మరోసారి తెలంగాణకు రానున్నారు.ఈనెల 31న కొల్లాపూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే.

ఈ బహిరంగ సభకు ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ విజయభేరీ బస్సు యాత్రను చేపట్టారు.కాగా మొదటి విడత బస్సు యాత్రను పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ప్రారంభించగా మూడు రోజుల పాటు కొనసాగింది.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement