నాని సినిమాలో ప్రియా వారియర్‌.. అంత మందితో అంటే ఒప్పుకుంటుందా

మలయాలి ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌ నటించిన మొదటి సినిమా ఒరు ఆదార్‌ లవ్‌ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల అయ్యేందుకు సిద్దం అయ్యింది.

గత ఏడాది సోషల్‌ మీడియా సంచలనంగా మారిన ప్రియా వారియర్‌కు గత ఏడాదే ఎన్నో సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.

ఏకంగా అల్లు అర్జున్‌ సినిమాలో కూడా ఈ అమ్మడికి అవకాశం దక్కింది.కాని ముద్దుగుమ్మ ప్రియా వారియర్‌ మాత్రం తన మొదటి సినిమా విడుదలైన తర్వాతే తదుపరి చిత్రాన్ని మొదలు పెట్టాలని భావించింది.

అందుకే వచ్చిన ఆఫర్లను వదిలేస్తూ వచ్చింది.

ఇప్పుడు ఒరు ఆదార్‌ లవ్‌ విడుదలకు సిద్దం అయిన కారణంగా కొత్త ప్రాజెక్ట్‌కు ఓకే చెబుతోంది.ఇప్పటికే ఒక చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ముద్దుగుమ్మకు తెలుగు నుండి ఒక ఆఫర్‌ వచ్చిందట.అది విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో మూవీకి.

Advertisement

నాని హీరోగా విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఆడవారిపై జరుగుతున్న లైంగిక వేదింపుల నేపథ్యంలో ఒక చిత్రం రూపొందుతోంది.ఆ చిత్రానికి సంబంధించిన కథతో ప్రియా వారియర్‌ ను యూనిట్‌ సభ్యులు కలిశారట.

ఈ చిత్రంలో మొత్తం ఆరుగురు హీరోయిన్స్‌ ఉంటారట.

ఆరుగురు హీరోయిన్స్‌లో ఒక హీరోయిన్‌ గా ప్రియా వారియర్‌ను ఎంపిక చేయాలని విక్రమ్‌ కుమార్‌ ప్రయత్నాలు చేస్తున్నాడట.ఆరుగురిలో కీలకమైన పాత్ర కోసం ప్రియా వారియర్‌ను సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.మరి ఆరుగురితో కలిసి నటించేందుకు ప్రియా వారియర్‌ ఒప్పుకుంటుందా అనేది చూడాలి.

నాని ప్రస్తుతం చేస్తున్న మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మార్చి 19 నుండి ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

ఈ సింపుల్ రెమెడీతో చెప్పండి హెయిర్ బ్రేకేజ్ కు బై బై..!
Advertisement