పల్లవి ప్రశాంత్ ఇలాంటోడు అని మాత్రం నేను అనుకోలేదంటూ ప్రిన్స్ యావర్ షాకింగ్ కామెంట్స్!

ఈ సీజన్ బిగ్ బాస్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో, అన్ని వివాదాలకు కూడా దారి తీసింది.

హౌస్ లో జరిగిన కొన్ని గొడవలు, బయట కూడా కొనసాగడం పెను దుమారం రేపింది.

ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) నిలిచి చరిత్ర తిరగరాసిన సంగతి మన అందరికీ తెలిసిందే.తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే కాదు, హిందీ ,తమిళం, కన్నడ మరియు మలయాళం ఇలా ఎన్ని భాషలు తీసుకున్నా ఒక సామాన్యుడు టైటిల్ గెలవడం అనేది ఎప్పుడూ జరగలేదు.

కేవలం పల్లవి ప్రశాంత్ విషయంలోనే అది జరిగింది.అయితే హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అత్యుత్సాహం తో ఆయన చేసిన కొన్ని కార్యక్రమాల కారణం గా గ్రాండ్ ఫినాలే రోజు అల్లర్లు చెలరేగాయి.

బిగ్ బాస్ హిస్టరీ లో ఎన్నడూ లేని విధంగా కంటెస్టెంట్స్ అందరి పైన దాడులు చేశారు పల్లవి ప్రశాంత్ కి సంబంధించిన వ్యక్తులు.

Prince Yawar, Shocking Comments That I Didnt Think That Pallavi Prashant Was L
Advertisement
Prince Yawar, Shocking Comments That I Didn't Think That Pallavi Prashant Was L

అక్కడ ఉన్నటువంటి భయానక పరిస్థితులలో పోలీసులు ర్యాలీ చెయ్యడం నిషేధం అని ప్రత్యేకంగా ప్రతీ కంటెస్టెంట్ కి తెలిపారు .అందరూ పోలీసుల మాటకి గౌరవం ఇచ్చి వేరే రూట్ ద్వారా వెళ్లిపోయారు.కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం వెనక్కి తిరిగి వచ్చి ర్యాలీ చేసి పోలీస్ నిబంధనలు అతిక్రమించాడు.

ఈ క్రమం లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది.వీటిని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి కాసేపటి క్రితమే అరెస్ట్ చేసారు.

ఇదంతా పక్కన పెడితే ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో చేసింది మొత్తం నాటకమే అని, హౌస్ లోకి అడుగుపెట్టే ముందే ఆయన యావర్ ( Prince Yawar )ని కలిసినట్టు వీడియోలు ఉన్నాయని, బిగ్ బాస్ హౌస్ లో ఎన్ని జరిగినా కలిసే ఆడాలని అనుకున్నారు అంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

Prince Yawar, Shocking Comments That I Didnt Think That Pallavi Prashant Was L

రీసెంట్ గా ఇంటర్వ్యూ ఇచ్చిన యావర్ ని యాంకర్ ఇదే విషయం మీద ప్రశ్నలు అడగగా ఆయన దానికి సమాధానం చెప్తూ బిగ్ బాస్ హౌస్ లోకి( Bii boss 7 ) అడుగుపెట్టక ముందు ప్రశాంత్ ని కలిసిన విషయం నిజమే.కానీ మేమెప్పుడూ కలిసి ఆడాలని అనుకోలేదు.105 రోజుల మా ఆటలో మీరు ఏ ఎపిసోడ్ అయినా చూసి రండి.ఒక్కటంటే ఒక్క ఎపిసోడ్ లో అయినా మేము గేమ్స్ గురించి మాట్లాడుకున్నట్టు చూపిస్తే నేను గెలుచుకున్న 15 లక్షలు తిరిగి ఇచ్చేస్తాను అంటూ ఎమోషనల్ గా మాట్లాడాడు.

నా హైట్ తో సమస్య.. నాతో మాట్లాడేవాళ్లు కాదు.. మీనాక్షి చౌదరి షాకింగ్ కామెంట్స్ వైరల్!
మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!

ఇంకా ఆయన మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ ని మొదట్లో చూసినప్పుడు ఇతనేమి ఇలాంటి గేమ్స్ ఆడుతాడు.ఇంతమందిని తట్టుకొని నిలబడడం కష్టమే అని అనుకున్నాను.కానీ అతని ఆట తీరు చూసి నాతో పాటుగా అంబటి ఆశ్చర్యపోయారు.

Advertisement

ఈ స్థాయి ఆటగాడు అని ఊహించలేకపొయ్యాం అంటూ ప్రశాంత్ గురించి ఆయన గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

తాజా వార్తలు