Prema Arundhati : ఆ హీరోయిన్ రిజెక్ట్ చేస్తేనే అనుష్కకు ఈ రేంజ్ స్టార్ డమ్? ఆ ఒక్క సినిమా వల్లే?

హీరోయిన్ ప్రేమ.ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో తన అందం అభినయంతో ఒక వెలుగు వెలిగింది.

స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రేమ( Prema ) ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.కానీ అప్పుడప్పుడు బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ప్రేక్షకులను పలకరిస్తోంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఒక షోలో పాల్గొన్న ప్రేమ తన కెరియర్ లో జరిగిన ఎన్నో విషయాల గురించి స్పందించింది.

ఈ సందర్భంగా ప్రేమ మాట్లాడుతూ.నేను అసలు సినిమాలలోకి రావాలని అనుకోలేదు.ఎయిర్ హోస్టెస్ కావాలి అనేది నా కల.మా అమ్మకు నన్ను ఒక నటిగా చూడాలని ఉండేది.ఆ విషయంలో చాలాసార్లు మా ఇద్దరికీ గొడవ కూడా అయింది.

Advertisement

కానీ ఆమె కొడుకును ఎందుకు తీర్చకూడదని నాకు అనిపించి మొదటిసారిగా సవ్యసాచి( Savyasachi ) అనే కన్నడ సినిమాలో నటించాను.ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాను అని చెప్పుకొచ్చింది ప్రేమ.

అనంతరం అరుంధతి( Arundhati ) సినిమాలో జేజమ్మ క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.అరుంధతి సినిమా అనుకున్నప్పుడు జేజమ్మ పాత్ర కోసం ముందుగా నన్ను సంప్రదించారు.

వరసగా కొన్ని రోజులపాటు డేట్స్ అడిగారు.కానీ నేను అప్పటికే కన్నడలో వరుసగా సినిమాలు చేస్తున్నాను.దానివల్ల డేట్స్ అడ్జెస్ట్ కాక ఆ పాత్రకు నో చెప్పాల్సి వచ్చింది.

సినిమా విడుదలైన తర్వాత చూశాను ఎంతో బాగా నచ్చింది.జేజమ్మ పాత్ర చేయలేక పోయినందుకు నాకేమీ బాధగా లేదు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

ఎందుకంటే ఆ పాత్ర అనుష్కకు రాసిపెట్టి ఉంది అంతే అని చెప్పుకొచ్చింది ప్రేమ.

Advertisement

తాజా వార్తలు