Pomegranate crop :దానిమ్మ పంట సాగులో కొమ్మ కత్తిరింపులలో పాటించవలసిన జాగ్రత్తలు..!

ప్రధాన వాణిజ్య పంటలలో దానిమ్మ పంట( Pomegranate farming ) కూడా ఒకటి.

దానిమ్మ పండ్ల చర్మం, రసం, ఆకులు, వేర్లు ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు.

పొడి వాతావరణం ఉండే ప్రాంతాలలో దానిమ్మ పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చు.దానిమ్మ పంట సాగుకు దాదాపుగా అన్ని రకాల నేలలు అనుకూలంగానే ఉంటాయి.

సున్నపు శాతం, క్షారత కాస్త అధికంగా ఉన్న, లోతైన నేలలలో కూడా దానిమ్మ పంటను సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చుదానిమ్మ పంట సాగులో గణేష్ భగువ, మృదుల, కాంధారి, జ్యోతి, పి-26 రకాలను సాగు చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చు.ఉదజని సూచిక 7.0 నుండి 8.5 వరకు ఉండే నేలలు దానిమ్మ పంట సాగుకు అనుకూలంగా ఉంటాయి.

దానిమ్మ పంట సాగులో అత్యంత కీలకం కొమ్మ కత్తిరింపులు.దానిమ్మ మొక్కలు బలంగా పెరిగిన నాలుగు కొమ్మలను కాండాలుగా ఉంచి మిగిలిన కొమ్మలను కత్తిరించాలి.రెండు నుంచి మూడు సంవత్సరాల లోపు ప్రధమ, ద్వితీయ, తృతీయ కొమ్మలను తగురీతిగా పెంచి సరైన ఆకారంలోకి తీసుకురావాలి.

Advertisement

నేలను తాకే కొమ్మలను, గుబురుగా పెరిగే కొమ్మలను, నీటి కొమ్మలను కత్తిరించాలి.దానిమ్మ చెట్లకు విశ్రాంతి ఇచ్చే సమయంలో చివరి కొమ్మలను 10 నుంచి 15 సెంటీమీటర్ల పొడవు కత్తిరించాలి.

కొమ్మ కత్తిరింపులు తర్వాత వచ్చిన చిగుర్లలో రెండు లేదా మూడు చిగుళ్లు ఉంచి మిగిలిన చిగుళ్ళను తీసేయాలి.ఇలా చేస్తే బలమైన కొమ్మలపై పిందెలు ఏర్పడి కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది.

దానిమ్మ చెట్టుపై 60 నుంచి 80 కాయలు మాత్రమే ఉంచి మిగిలిన వాటిని తీసేయాలి.ఇలా చేస్తే కాయల సైజు, నాణ్యత పెరుగుతుంది.ముఖ్యంగా కొమ్మ కత్తిరింపులకు వాడే కత్తెరలను ఒక శాతం హైపోక్లోరైడ్( Hypochloride ) ద్రావణంతో శుద్ధి చేసిన తర్వాతనే కొమ్మ కత్తిరింపులు జరిపించాలి.

కోమ్మ కత్తిరింపులలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచి నాణ్యమైన అధిక దిగుబడి( High yield ) పొందవచ్చు.

పవర్ స్టార్ ఓజీ కర్ణాటక హక్కుల వివరాలివే.. రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయిగా!
Advertisement

తాజా వార్తలు