హనుమాన్ మూవీ( Hanuman Movie ) ఇప్పటికే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
హనుమాన్ మూవీ నిన్న కూడా భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది.
ఈరోజు కూడా కొన్ని థియేటర్లలో ఈ సినిమా అదిరిపోయే బుకింగ్స్ తో ప్రదర్శితమవుతోంది.ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ( Director Prasanth Varma ) హనుమాన్ మూవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హనుమంతుడి విగ్రహాన్ని తెరపై చూసిన సమయంలో అభిమానులు పిచ్చెక్కిపోతున్నారని ప్రశాంత్ వర్మ అన్నారు.పవన్ లాంటి మాస్ హీరో సినిమా విడుదలైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో తెరపై హనుమంతుడిని( Hanuman ) చూసిన సమయంలో సైతం అలాగే పండుగ చేసుకుంటున్నారని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.
ఫుల్ రన్ లో ఈ సినిమా 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సైతం సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.హనుమాన్ సీక్వెల్ మరింత ఎక్కువ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.
జై హనుమాన్( Jai Hanuman ) సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించగా తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేశారు.జై హనుమాన్ మూవీలో తేజ సజ్జా( Teja Sajja ) పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని సమాచారం అందుతోంది.
హనుమాన్ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది.
హనుమాన్ మూవీ సీక్వెల్ లో తేజ సజ్జా కేవలం కొన్ని సీన్లకే పరిమితం కానున్నారని భోగట్టా.జై హనుమాన్ మూవీలో చిరంజీవి( Chiranjeevi ) నటించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.జై హనుమాన్ మూవీ చిన్న సినిమా కాదని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.
ప్రశాంత్ వర్మ పారితోషికం సైతం భారీ రేంజ్ లో పెరిగిందని సమాచారం అందుతోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy