Hanuman : హనుమాన్ కు జై హనుమాన్ కు తేడా ఇదేనన్న ప్రశాంత్.. తేజ సజ్జా పాత్ర చిన్నదంటూ?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ సినిమా( Hanuman movie ) మేనియా ఎక్కువగా కనిపిస్తోంది.

ప్రశాంత్ వర్మ( Prashant Verma ) దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో పాటు కాసుల వర్షం కురిపిస్తోంది.

ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించడంతో మూవీ మేకర్స్ సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్ లో జై హనుమాన్( Jai Hanuman ) ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.

దానితో పాటు హనుమంతుడు రాముడుకి ఇచ్చిన మాట ఏమిటి అనే ట్విస్టు కూడా పెట్టారు.ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ వర్మ తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రతి సంక్రాంతికి ఒక సూపర్ హీరో చిత్రంతో ముందుకు వస్తాను అని తెలిపారు ప్రశాంత్ వర్మ.

Advertisement

అంతేకాకుండా జై హనుమాన్ సినిమాలో హనుమంతుడు రాముడికి ఇచ్చిన మాట ఏంటి అనేది చూస్తారు అని తెలిపారు.హనుమాన్ కేవలం ఒక భాగం మాత్రమే సీక్వెల్స్, ప్రీక్వెల్స్ చేయాలనే ఆలోచన ఉంది అని తెలిపారు. సముద్రఖని( samudrakhani ) పోషించిన విభీషణుడి పాత్ర లేదని దీన్నొక ఫ్రాంఛైజీలా తీసుకురావాలనుకున్నప్పుడు ఈ పాత్రను క్రియేట్‌ చేసినట్లు చెప్పుకువచ్చారు.

హనుమాన్ కథతో పోలిస్తే.జై హనుమాన్ మరింత స్పెషల్ గా ఉంటుందని, ఇందులో తేజ పాత్ర తక్కువ నిడివితో ఉంటుందని తెలిపారు ప్రశాంత్ వర్మ.

జై హనుమాన్ చిత్రంలో కొత్త పాత్రలు తెరపైకి వస్తాయని, అవేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలని సస్పెన్స్ పెట్టారు.

కాగా ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ లో 20 స్క్రిప్టులు ఉన్నట్లు తెలిపారు.మొదటి దశలో ఆరుగురు సూపర్‌ హీరోల సినిమాలు తీస్తామని తెలిపారు.అందుకు సంబంధించిన వివరాలు చెప్పడానికి ఇంకాస్త సమయం ఉందని వెల్లడించారు.

లిచి పండ్లలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలుసా?

తనతో పాటు కొత్త దర్శకులు కూడా పరిచయమవుతారని వెల్లడించారు.ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక మూవీ వస్తుందని చెప్పుకొచ్చారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

Advertisement

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు