కన్నడ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా కొనసాగుతూ ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) ఒకరు.
కన్నడ చిత్రపరిశ్రమలో పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉన్నటువంటి ఈయన కే జి ఎఫ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ఈయన క్రేజ్ కూడా పెరిగిపోయింది.
ఇక ఈ సినిమా తర్వాత తెలుగులో ప్రశాంత్ చేసిన సలార్( Salaar ) సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
ప్రభాస్( Prabhas ) హీరోగా చేసినటువంటి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.త్వరలోనే ఈ సినిమా రెండో భాగం షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి.ఇలా ఇండస్ట్రీలో డైరెక్టర్గా ఎంతో గుర్తింపు పొందినటువంటి ప్రశాంత్ ఇటీవల ఓ టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తనకు ఇష్టమైనటువంటి హీరో హీరోయిన్ గురించి అలాగే డైరెక్టర్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
సినిమాల పరంగా ఎంతో నైపుణ్యం కలిగినటువంటి ఈ డైరెక్టర్ కు ఏ డైరెక్టర్ అంటే ఇష్టం అనే విషయం గురించి ఆసక్తి నెలకొంది.ప్రశాంత్ నీల్ కి ఉపేంద్ర( Upendra ) ఆల్ టైం ఫేవరేట్ దర్శకుడు అట.అందుకు కారణం ఉందట.ఉపేంద్ర తెరకెక్కించిన ఉష్, A , ఓం, ఉపేంద్ర.
చిత్రాలు చాలా ప్రత్యేకం.ఆయన సెటైరికల్ స్టోరీ టెల్లింగ్ ఎవరికీ సాధ్యం కాదని ప్రశాంత్ నీల్ అన్నారు.
అందుకే తనకి ఎప్పటికీ ఉపేంద్ర అంటే చాలా ఇష్టమని ఈ సందర్భంగా ప్రశాంత్ తెలిపారు.ఇక నటుడు అమితాబ్( Amitabh ) నటి శ్రీదేవి( Sri Devi ) అంటే తనకు ఇష్టమని ఈయన వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy