ఇంత పెద్ద స్టార్ డైరెక్టర్ కానీ ఈ లోపం ఒకటి సరి చేసుకోవాలి..!

సినిమాకి కెప్టెన్ అంటే డైరెక్టర్ మాత్రమే.నిర్మాత అయిన హీరో అయినా ఎవ్వరైనా సరే డైరెక్టర్ చెప్పిన మాటే వినాలి.

ఆయన అడిగింది అడిగినట్టుగా ఇస్తేనే సినిమా బాగా వస్తుంది.అది బడ్జెట్ అయినా యాక్టింగ్ అయినా ఆయన లైన్ లోనే ఉండాలి.

అంతలా సినిమాని ప్రభావితం చేసే ఏకైక వ్యక్తి డైరెక్టర్.ఇక డైరెక్టర్ మొదటి చేసే పని ఏంటంటే సరైన కథను ఎంచుకొని దాన్ని మంచిగా రెడీ చేసుకుని ఆర్టిస్టులకు ప్రాపర్ గా నరేట్ చేసుకుని అందరినీ కన్విన్స్ చేసుకొని సినిమా సెట్స్ పైకి వెళ్తారు.

ఇక్కడ ఎక్కడ లోపం జరిగినా కూడా సినిమా బెడిసి కొడుతుంది.కథ సరిగ్గా లేకపోయినా రెడీ చేసుకున్న కథను సరిగ్గా చెప్పలేకపోయినా అది పెద్ద సమస్య అవుతుంది.

Advertisement

అయితే మన ఇండస్ట్రీలో ఈ ప్రాబ్లం ఉన్న ఏకైక స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ).కథ చాలా బాగా రాసుకుంటాడు దాన్ని అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేయగలడు.కానీ రాసుకున్న కథను నటీనటులకు నరేట్ చేయడం అంటే ప్రశాంత్ నీల్ తో కాదు.

ఈ విషయాన్ని ప్రశాంత్ సైతం ఒప్పుకుంటాడు.ఇండస్ట్రీలో చాలామంది ఇదే విషయాన్ని కన్ఫర్మ్ కూడా చేశారు.

పైగా ప్రశాంత్ ఏమి సాధారణ డైరెక్టర్ కాదు ఆయన ప్రస్తుతం ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ గా ఉన్నారు.కే జి ఎఫ్ సినిమాలతో ఆయన రేంజ్ మారిపోగా సలార్ సినిమా అతడిని ఆకాశమంత ఎత్తుకు నిలబెట్టింది.

మరి ఇంత స్టార్ డైరెక్టర్ కథను నటీనటులకు సరిగా నరేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది.ఎలా అంటే ఈ విషయాన్ని ప్రభాస్ ఓసారి స్టేజిపై చెప్పాడు సలార్ ( Salaar )స్టోరీ చెప్పినప్పుడు తనకు ఏమీ అర్థం కాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.ప్రభాస్ మాత్రమే కాదు శృతిహాసన్ కూడా ఇదే విషయాన్ని చెప్పింది.

ఇక కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక లేనట్టే ? 
రష్యన్ యువతి కోరికలు విన్నారా.. ముందుగా అదే కావాలట..

పోనీ మన తెలుగు రాక ప్రశాంతి ఇబ్బంది పడ్డాడు నటీనటులకు సరిగా కథ చెప్పలేకపోయాడు అనుకుంటే మలయాళం చాలా బాగా మాట్లాడే ప్రశాంత్ నిల్ పృథ్వీరాజ్ సుకుమారన్ కి సైతం సరిగా కథని చెప్పలేదట.ప్రభాస్ కోసంమే ఈ సినిమాలో నటించాడు అని తర్వాత చెప్పాడు.

Advertisement

తాజా వార్తలు