అల్లు అర్జున్ ను లైన్ లో పెట్టిన ప్రశాంత్ వర్మ... విజువల్ వండర్ గా రాబోతుందా..?

చాలామంది సీనియర్ దర్శకులు ఒక మూస ధోరణిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు కదులుతుంటే యంగ్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) మాత్రం తన మొదటి సినిమా ఆయన అ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన హనుమాన్ సినిమా( Hanuman Movie ) వరకు అన్ని వైవిధ్యమైన కథాంశాలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

ఇక మొదటినుంచి అంటే సినిమా డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కూడా ఆయన డిఫరెంట్ షార్ట్ ఫిలిమ్స్ చేసి దర్శకుడి గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు.

అందువల్లే ఆయనకి డైరెక్టర్ గా చేసే అవకాశం అయితే వచ్చింది.

ఇక ఒక ఇంటర్వ్యూలో ఆయనకి రొటీన్ సినిమాలు చేయడం నచ్చదని డిఫరెంట్ తరహా సినిమాలను చేస్తూ ముందుకు కదలడమే తనకు చాలా ఇష్టమని చెప్పిన ప్రశాంత్ వర్మ ప్రస్తుత జై హనుమాన్( Jai Hanuman Movie ) సినిమాని తెరకెక్కిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో( Allu Arjun ) ఒక సినిమా చేయాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే ఆయన ఇప్పటికే అల్లు అర్జున్ కు ఒక లైన్ కూడా వినిపించాడట.

తనకి కూడా ఆ లైన్ చాలా బాగా నచ్చిందని జై హనుమాన్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయనకి పూర్తి స్క్రిప్ట్ ను వినిపించబోతున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి.

Advertisement

ఇక మొత్తానికైతే అల్లు అర్జున్ తో ఆయన ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది.ఇక నిజానికి ప్రశాంత్ వర్మ లాంటి టాలెంటెడ్ దర్శకుడికి అందరూ డేట్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.ఎందుకంటే ఆయన చాలా తక్కువ బడ్జెట్ లోనే హనుమాన్ సినిమాకి ది బెస్ట్ ఔట్ పుట్ తీసుకొచ్చాడు.

కాబట్టి ఆయనతో సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకోవడానికి స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.చూడాలి మరి ఇక ముందు ప్రశాంత్ వర్మ ఎంత మంచి డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎదుగుతాడు అనేది.

Advertisement

తాజా వార్తలు