Pradeep Ranganatham Rishabh Shetty : ట్యాలెంట్ ఎవరు సొత్తు కాదు కంటెంట్ ఉంటె కటౌట్ అక్కర్లేదు భయ్యా

లవ్ టుడే సినిమా రిలీజ్ అయ్యి బాగానే కుమ్ముతుంది.ఈ సినిమా చూడగానే ఒక పాట గుర్తచ్చింది.

ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటు అనే పాట చక్కగా సరిపోతుంది ఈ సినిమాలోని హీరో కి.బక్క పలచగా ఉంది, గట్టిగా గాలస్తే కొట్టుకుపోయేలా కనిపిస్తున్న ఇతగాడి పేరు ప్రదీప్ రంగనాథన్.అయినా సినిమా తీయాలంటే ఉండాల్సింది కటౌట్ కాదు కేవలం కంటెంట్ మాత్రమే.

అందుకు 8 ఏళ్ళ క్రితం ఒక షార్ట్ ఫిలిం తీసాడు.దాన్ని తమిళ ఇండస్ట్రీ లోని అందరి హీరోలకు పంపించాడు.అది నచ్చితే అవకాశం ఇవ్వాలని హీరోలందరికీ మెసేజ్ పెట్టాడు.

దాంతో జయం రవి పిలిచి అవకాశం ఇచ్చాడు.ఆలా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కోమలి.2019 లో విడుదల అయినా ఈ సినిమాకు ప్రదీప్ కథ రాసి డైరెక్షన్ చేయడం మాత్రమే కాకుండా ఒక రోల్ లో నటించాడు.ఈ సినిమా తమిళనాట ఘనవిజయం సాదించింది.

Advertisement

ఏకంగా 50 కోట్ల కలెక్షన్స్ తో దుమ్ము దులిపింది.ఇక మూడేళ్లపాటు విరామం తీసుకొని తానే హీరో గా నటిస్తూ కథ రాసి దర్శకత్వం కూడా చేసిన లవ్ టుడే కేవలం ఐదు కోట్లతో తెరకెక్కి 70 కోట్లతో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

లవ్ టుడే సినిమా చాల బాగుంది.మంచి యూత్ ఫుల్ సినిమాగా వచ్చింది.

ఇక ప్రదీప్ కూడా భవిష్యత్తు లో హీరో గా ఉంటాడో లేదో కానీ పెద్ద డైరెక్టర్ మాత్రం అయ్యే అవకాశం ఉంది.

ఇక ఇన్ని విభాగాలు బాగా హ్యాండిల్ చేసిన ప్రదీప్ లవ్ టుడే సినిమాలో పాటలు కూడా రాయడం గమనార్హం.ఈ చిత్రాన్ని తల్లిదండ్రులతో కూడా ఎంతో జీవచ్ఛగా చూడవచ్చు.హీరోకు తల్లిగా రాధికా చాల చక్కగా నటించారు.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

ఈ మధ్య రిషబ్ శెట్టి నుంచి ప్రదీప్ రంగనాథన్ వరకు అందరు తామే అన్ని చేస్తున్నారు.కథలు రాస్తూ, నటిస్తూ, దర్శకత్వం వహించడం బాగానే వర్క్ అవుట్ అవుతుంది.

Advertisement

వారు రాసుకున్న కథకు వారు మాత్రమే బాగా న్యాయం చేయగలరని నమ్ముతున్నారు.రానున్న కాలంలో యంగ్ హీరోలంతా ఇదే ట్రెండ్ ఫాలో అవుతూ హిట్స్ కొడుతూ సక్సెస్ అవుతున్నారు.