స్పిరిట్ సినిమా కోసం 3 డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్న ప్రభాస్...

తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రస్తుతం ఇండియా వైడ్ గా ఒక భారీ గుర్తింపు అయితే ఉంది.

అందుకే మన దర్శక నిర్మాతలు ఆ పేరు ను ఎక్కడ చెడగొట్టకుండా భారీ సినిమాలను చేసి పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అందుకుంటున్నారు.

ఇక ప్రస్తుతం ప్రభాస్( Prabhas ) ఇండియాలో నెంబర్ వన్ స్టార్ హీరోగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇక అందులో భాగంగానే ఇప్పుడు ఆయన నాలుగు సినిమాలను లైన్లో పెట్టాడు.

మరి అందులో ఏ సినిమాను ముందుగా మొదలుపెట్టాలి అనే విషయం మీదనే క్లారిటీ అయితే రావడం లేదు.కానీ ప్రభాస్ మాత్రం తను చేయబోయే ప్రతి సినిమాలో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకుంటున్నాడు.ఇక ఇలాంటి క్రమం లోనే సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) డైరెక్షన్ లో చేస్తున్న స్పిరిట్ సినిమా( Spirit Movie ) గురించి ఆయన కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

అయితే స్పిరిట్ సినిమాలో ఆయన మూడు వేరియేషన్స్ లో నటించాల్సిన అవసరం అయితే ఉందట.

Advertisement

అందుకోసమే ఒక్కొక్క క్యారెక్టర్ లో తన మేకోవర్ గురించి స్పెషల్ కేర్ ని తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తోంది.నిజానికి సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోలు టైమ్ పిరియడ్ ను బట్టి ఒక్కొక్క టైం లో ఒక్కొక్క లుక్ లో కనిపిస్తూ ఉంటారు.ఇక ఇప్పుడు ప్రభాస్ ను కూడా అదే విధంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

మరి ఈ సినిమాతో సందీప్ ఎలాంటి మ్యాజిక్ ను చేస్తాడు.ఈ సినిమాని భారీ సక్సెస్ గా నిలుపుతాడా లేదా అనే విషయాలను కూడా తెలియాల్సి ఉన్నాయి.

ఒక వేళ ఈ సినిమా భారీ సక్సెస్ కొడితే మాత్రం అటు ప్రభాస్, ఇటు సందీప్ వంగ ఇద్దరు ఇండియా లోనే టాప్ లెవల్ కి వెళ్తారు.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు