వెకేషన్ చెక్కేసిన డార్లింగ్.. ఏ ప్లేస్ కు వెళ్ళాడో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన తాజా సినిమా రాధేశ్యామ్.ఈ నెల 11న రిలీజ్ అయ్యింది.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.ఈ సినిమా రిలీజ్ అయ్యి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.

అయితే విజువల్ వండర్ అంటూ ప్రేక్షకులు ఈ సినిమాను మెచ్చు కుంటున్నారు.అందరిని ఆకర్షించిన పాన్ ఇండియా సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూసారు.

రిజల్ట్ ఎలా ఉన్న కలెక్షన్స్ మాత్రం బాగా రాబట్టింది.రెండు రోజుల్లోనే 119 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది.

Advertisement

ఇక కలెక్షన్స్ కు ఏమాత్రం డోఖా లేకపోవడంతో ప్రభాస్ ఈ స్పేస్ లో వెకేషన్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళాడు.ఈయన రాధేశ్యామ్ కోసం ఇన్ని రోజులు వరుస ప్రొమోషన్స్ చేసాడు.

దీంతో ఆయన చిల్ అవుట్ అవ్వడానికి ఇటలీ వెళ్లినట్టు సమాచారం.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ తన తదుపరి సినిమా కోసం షూటింగ్ స్టార్ట్ చేసే ముందు తనని తాను రిఫ్రెష్ చేసుకునేందుకు వెకేషన్ ప్లాన్ చేసుకున్నాడు.

ప్రభాస్ మార్చి 10నే వెకేషన్ కు వెళ్ళిపోయాడట.ఆయన పాటు ఆయన స్నేహితులు కూడా వెళ్లారని సమాచారాం.వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన వెకేషన్ వెళ్లకపోతే కష్టమే.

ఈయన సినిమా విషయానికి వెళ్తే.ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది.షూటింగ్ పూర్తి చేసుకుని ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపు కుంటుంది.

Lorem Ipsum Dolor Sit Amet
Garam masala : భారతీయులు ఉపయోగించే గరం మసాలాతో.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!

ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది.

Advertisement

అలాగే నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ చేస్తున్నాడు.

" autoplay>

తాజా వార్తలు