రాధేశ్యామ్‌ ఆ ప్రచారం తో భారీ నష్టం తప్పదా?

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన రాధేశ్యామ్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమా కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

సినిమా స్లో గా ఉంది అంటూ మాస్‌ ఆడియన్స్ కామెంట్ చేస్తుంటే.క్లాస్ ఆడియన్స్ మాత్రం సినిమా బాగుందంటూ కితాబిస్తున్నారు.

సినిమా కు మహారాజ పోషకులు అంటే ఖచ్చితంగా యూత్ ఆడియన్స్ అనడంలో సందేహం లేదు.ఈ సినిమా కి వారు బాగా కనెక్ట్ అవుతున్నారు.

స్క్రీన్‌ ప్లే విషయంలో కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ సినిమా కు మంచి వసూళ్లు వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతుంది.ఓవర్సీస్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి కూడా కచ్చితంగా మంచి వసూళ్ళు వస్తాయని ఇప్పటికే టాక్ వచ్చింది.

Advertisement

ఇక హిందీ వెర్షన్ సినిమా భారీ వసూళ్లను దక్కించుకునే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా అంతకు మించిన వసూళ్లు వస్తాయనే నమ్మకం మొదటి నుంచి ప్రచారం జరిగింది.

అయితే సినిమా లో కథనం స్లో గా ఉంది అంటూ ప్రచారం జరగడం తో కాస్త డ్యామేజ్ అయితే తప్పడం లేదు.

500 కోట్లు వసూలు చేస్తుందని ముందస్తు గా ఊహించిన ఈ సినిమా ఇప్పుడు కచ్చితంగా స్లో కథనం అంటూ వచ్చిన టాక్‌ తో వసూళ్ల సందడి అయితే తగ్గుతుందని అందరూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.సినిమా యూనిట్‌ సభ్యులు ఆ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా స్లో గా ఉన్నా కూడా బాగుంది అంటూ ప్రచారం చేయడం తప్పితే ఇప్పుడు మరి ఏం చేయలేని వారు అంటున్నారు.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!
Advertisement