తన డైరెక్టర్ కు ప్రభాస్ బర్త్ డే విషెష్.. వరల్డ్ మొత్తం నీ క్రియేషన్ చూడాలంటూ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాల్లో ప్రాజెక్ట్ కే (Project K) ఒకటి.

ప్రభాస్ మొట్ట మొదటిసారిగా నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

మరి ప్రభాస్ వరల్డ్ లెవల్లో చేస్తున్న ప్రాజెక్ట్ కే నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కుతుంది.బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ప్లాప్స్ అవుతున్న కూడా ప్రభాస్ చేస్తున్న సినిమాలపై ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు.

అందుకే ప్రాజెక్ట్ కే టీమ్ అంతా ఈ సినిమాను ఎలాగైనా వరల్డ్ వైడ్ గా సంచలన విజయం చేయాలని కష్టపడుతున్నారు.ఇదిలా ఉండగా ఈ రోజు ఫిలిం మేకర్ నాగ్ అశ్విన్ పుట్టిన రోజు.ఈ సందర్భంగా డార్లింగ్ సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

నాగ అశ్విన్ (Nag Ashwin Birthday) కు టీమ్ మొత్తం శుభాకాంక్షలు చెబుతున్న నేపథ్యంలో డార్లింగ్ కుడి విషెష్ తెలిపారు.

Advertisement

ఈయన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేస్తూ.మోస్ట్ టాలెంటెడ్ అండ్ దయ హృదయం కలిగిన మా డైరెక్టర్ నాగ్ అశ్విన్ గారికి బర్త్ డే విషెష్ తెలుపుతున్న అని.నీ క్రియేషన్ ఈ వరల్డ్ కి చూపించడానికి చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని ప్రభాస్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.ఇక హాలీవుడ్ కు ఏ మాత్రం తీసిపోని విధంగా తెరకెక్కుతున్న ఈ సినిమా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.అలాగే ఒక వైపు షూట్ పూర్తి చేస్తూనే మరో వైపు విఎఫ్ఎక్స్ వర్క్ ఫాస్ట్ గా చేస్తున్నారు.ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రకటించారు.

దీంతో ఆ సమయం కంటే ముందే పూర్తి చేసి ప్రమోషన్స్ కోసం సమయం కేటాయించాలని మేకర్స్ చూస్తున్నారు.చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు