ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌... 'సాహో'కు కౌంట్‌ డౌన్‌ మొదలైంది

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి కోసం దాదాపు అయిదు సంవత్సరాలు కష్టపడ్డాడు.ఆ కష్టానికి రెట్టింపు ప్రతిఫలం ప్రభాస్‌కు దక్కింది.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రంతో ప్రభాస్‌ ఇండియాస్‌ సూపర్‌ స్టార్‌ అయ్యాడు.అంతటి క్రేజ్‌ను కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మళ్లీ అంతటి స్థాయి సినిమాను చేయాలని ప్రభాస్‌ భావించి చేస్తున్న చిత్రం సాహో.

రెండు సంవత్సరాలుగా ఈ సినిమా గురించిన చర్చలు జరుగుతున్నాయి.సినిమా ప్రారంభం అయ్యి సంవత్సరంకు ఎక్కువ అయ్యింది.

ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

ఇటీవలే విడుదలైన షేడ్స్‌ ఆఫ్‌ సాహో ఛాప్టర్‌ 2 వీడియోలో విడుదల తేదీ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోవడంతో మళ్లీ సినిమా వాయిదా పడనుందా అంటూ ప్రచారం జరిగింది.వచ్చే ఆగస్టు 15న కూడా సినిమా విడుదల లేనట్లేనా అంటూ అంతా భావిస్తున్న సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మరోసారి క్లారిటీ ఇచ్చారు.సినిమా ఖచ్చితంగా వచ్చే ఆగస్టు 15న విడుదల కాబోతుందని ప్రకటించారు.

సాహోకు కౌంట్‌ డౌన్‌ కూడా ప్రారంభించారు.మరో 160 రోజుల్లో సాహో విడుదల కాబోతుందని హ్యాప్‌ ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది.

సాహో విడుదలపై ఉన్న అనుమానాలన్నింటిని కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు చేసిన ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.తప్పకుండా సినిమా అనుకున్న సమయానికి విడుదల అయ్యేలా యూవీ క్రియేషన్స్‌ వారు ప్లాన్‌ చేస్తారనిపిస్తుంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నారు.

జూన్‌ వరకు సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తి అయ్యేలా ప్లాన్‌ చేశారు.రెండు నెలల పాటు సినిమా ప్రమోషన్స్‌ను నిర్వహించి, ఆ తర్వాత సినిమాను గ్రాండ్‌గా ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

తెలుగుతో పాటు హిందీ, తమిళంలో కూడా బాహుబలి స్టార్‌ మూవీ అంటూ విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు.సాహో కౌంట్‌ డౌన్‌ మొదలైన నేపథ్యంలో ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు.

Advertisement