ప్రాజెక్ట్ కే మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న డైరెక్టర్లు అందరూ కూడా కొన్ని సినిమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్త గా ఉంటారు ముఖ్యం గా పెద్ద హీరో తో సినిమా అంటే మాత్రం ప్రతి డైరెక్టర్ కూడా చాలా కేర్ తీసుకుంటాడు ఎందుకంటే అది చాలా ప్రస్టేజియస్ గా తీసుకుంటారు .

ఇక ప్రస్తుతం నాగ్ అశ్విన్( Director Nag Ashwin ) దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898AD సినిమా( Kalki 2898 AD )పై కూడా దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ సినిమా పై జనాల్లో అంచనాలు మామూలుగా లేవు.

ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లింప్స్( Kalki 2898 AD Glimpse )) అనుకున్నంత స్థాయిలో పాజిటివ్ బజ్ క్రియేట్ చేయకపోయినప్పటికీ కూడా ఈ సినిమా తప్పకుండా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ కూడా ఎంతో నమ్మకంతో ఉన్నారు.ఇక ఈ సినిమాను మొదట అయితే 2024 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.కానీ ఆ డేట్కు సినిమా సిద్ధమయ్యేలా కనిపించడం లేదు.

అయితే దాదాపు గా ఇలాంటి సినిమాల రిలీజ్ అనేది తరుచూ గా వాయిదా పడుతూ ఉంటుంది ఎందుకంటే ఇది ఎక్కువగా గ్రాఫిక్స్ కి సంబంధించిన విషయాలలో ముడి పడి ఉంటుంది కాబట్టి దాని గురించి మనం ఏం చెప్పలేము.

Advertisement

దీంతో 2024 ఏప్రిల్ నెలలో ఈ సినిమా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా టాక్ అయితే వినిపిస్తుంది.ఇక ఆ కథనాలపై దర్శకుడు ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు.కల్కి షూటింగ్ దాదాపు దురదశకు చేరుకుంది.

ఇంకా కొంత భాగమే మిగిలి ఉంది.ప్రస్తుతం ఫోకస్ మొత్తం దానిపైనే ఉంది.

ఇక విడుదల డేట్ విషయంలో కూడా ఒక మంచి రోజు చూసుకుని క్లారిటీ ఇస్తామని అంటూ.ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) మాత్రం గతంలో ఎప్పుడు లేనంత సరి కొత్తగా కనిపించబోతున్నాడు అని దర్శకుడు నాగ్ అశ్విన్ ఒక మీడియా ఇంటర్వ్యూలో అయితే వివరణ ఇచ్చాడు.

మరి అనుకున్న డేట్ ప్రకారం సంక్రాంతి( Kalki 2898 AD Release )కి వస్తారా? లేదంటే కాస్త ఆలస్యంగా ఏప్రిల్ నెలలో వస్తారా? అనే విషయం తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Boyle Sports Customer Support And Service Quality : A Practical Guide For UK Players
Advertisement

తాజా వార్తలు