Ram Charan Prabhas : చరణ్ పుట్టినరోజు.. అలాంటి పని చేసిన ప్రభాస్ ఫ్యాన్స్.. నిజంగా గ్రేటబ్బా?

సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు అయితే ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహాం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు.

కానీ ప్రభాస్( Prabhas ) అభిమానులు మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పాలి.

ఇటీవల హీరో రామ్ చరణ్( Ram Charan ) పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు చేసిన పనికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిజానికి రామ్ చరణ్ ప్రభాస్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు ఇలా వీరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం పలు సందర్భాలలో బయటపడింది.అయితే తాజాగా చరణ్ పుట్టినరోజు( Ram Charan Birthday ) సందర్భంగా ప్రభాస్ అభిమానులు అనాధ పిల్లలకు( Orphan Children ) ఆహారం పంపిణీ చేశారు.ఈ ఆహారం పంపిణీ చేసినటువంటి బాక్సులపై రామ్ చరణ్ ఫోటోతో పాటు ప్రభాస్ ఉన్న ఫోటోలను అతికించి.

హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అని రాసుకొచ్చారు.ప్రస్తుతం దీనికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ ఫోటోలు చూసినటువంటి ఇతర హీరోల అభిమానులు కూడా వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.మీరు నిజంగా గ్రేట్ అభిమానులు అంటే మీలాగే ఉండాలి సాధారణంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు.కానీ ఒక హీరో పుట్టినరోజు మరొక స్టార్ హీరో అభిమానులు ఇలా ఫుడ్ పంపిణీ( Food Distribution ) చేయడం నిజంగా గ్రేట్ అని ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా ఇలాగే ఉండి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.

ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు