రిపీట్ కాబోతున్న మిర్చి కాంబినేషన్... ఆ కండిషన్ తప్పనిసరి?

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ వరుస ఆ చిత్రాలలో నటిస్తూ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ప్రభాస్ ఇకపై తన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోని చిన్న దర్శకులను పక్కనపెట్టి హిట్ దర్శకులతో సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ సమాచారం.ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.

అదేవిధంగా రాధేశ్యామ్ చిత్రంపై భారీ బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని తెరకెక్కించిన యువీ క్రియేషన్స్ కూడా భారీ నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది.ఈ క్రమంలోనే తన వల్ల తీవ్రంగా నష్టపోయిన యు.

వి.క్రియేషన్స్ లాభాలు తేవాలని ప్రభాస్ తాపత్రయపడుతున్నారు.ఇక తనకు మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన కొరటాల డైరెక్షన్ లో ప్రభాస్ మరో సినిమా చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Advertisement

కొరటాల సినిమా తప్పనిసరిగా మంచి విజయాన్ని అందుకుంటుందని దీంతో నిర్మాతలకు కూడా కాస్త ఊరటగా ఉంటుందని ప్రభాస్ భావించినట్లు తెలుస్తోంది.ఇక సినిమాల పరంగా డైరెక్టర్ కొరటాల శివ, ప్రభాస్ కూడా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక వీరి సినిమాలన్నీ పూర్తిచేసుకుని ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ కావాలంటే చాలా సమయమే పడుతుందని చెప్పాలి.అయితే ప్రభాస్ కొరటాల శివ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై సినిమా చేయాలని భావిస్తుండగా కొరటాల శివ మాత్రం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.మైత్రి మూవీ మేకర్స్ తో అయితే కొరటాల ప్రభాస్ సినిమా తెరపైకి వస్తుందని తెలుస్తోంది.

మరి ఈ కండిషన్ కి ప్రభాస్ ఒప్పుకుంటారా? అసలు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాలంటే ఈ విషయంపై ప్రభాస్ కొరటాల శివ స్పందించాల్సి ఉంది.

రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు : రాష్ట్ర మంత్రులు
Advertisement

తాజా వార్తలు