ఆ విషయంలో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రభాస్.. ఏకంగా నాలుగు సినిమాలతో సంచలనం?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) తాజాగా ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరికెక్కిన ఈ సినిమా జూన్ 16వ తేదీ అత్యధిక థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమా పట్ల కొందరు విమర్శలు చేయగా ప్రభాస్ అభిమానులు మాత్రం సినిమా అద్భుతంగా ఉంది అంటూ ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిందని తెలుస్తోంది.

Prabhas Created A New Record In That Regard,prabhas,adipurush,kriti Sanon,saaho

ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి రోజు 100 కోట్లను సాధించడంతో ప్రభాస్ మరొక రేర్ ఫీట్ సాధించారు.ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొదటిరోజు 100 కోట్ల కలెక్షన్లలో రావట్టినది కేవలం ఆరు సినిమాలు మాత్రమే అందులో బాహుబలి 2, సాహో, రాధే శ్యామ్,ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్ చాప్టర్ 2, పఠాన్ ఈ చిత్రాలు మాత్రమే మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి.అయితే తాజాగా ఆది పురుష్ సినిమా( Adipurush ) కూడా మొదటి రోజు 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి తొలి రోజు 100 ఓపెనింగ్స్ సాధించిన సినిమాల జాబితాను ఏడుకు చేర్చడమే కాకుండా ఇందులో ప్రభాస్ నటించిన సినిమాలు ఏకంగా నాలుగు ఉండటం విశేషం.

Prabhas Created A New Record In That Regard,prabhas,adipurush,kriti Sanon,saaho

ఇలా ఇప్పటివరకు ఏ హీరో కూడా సాధించని అరుదైన రికార్డ్ ప్రభాస్ సాధించారని ఈ రేర్ ఫీట్ కేవలం ప్రభాస్ కి మాత్రమే సాధ్యమైంది అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రభాస్ తాజాగా నటించిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రస్తుతం మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ సినిమా కమర్షియల్ గా కూడా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement
Prabhas Created A New Record In That Regard,Prabhas,Adipurush,Kriti Sanon,Saaho

ఇందులో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించగా సీత పాత్రలో కృతి సనన్ ( Kriti Sanon )నటించి సందడి చేశారు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !
Advertisement

తాజా వార్తలు