రాజాసాబ్ మూవీతో ఆ రికార్డ్ అందుకోనున్న ప్రభాస్.. కచ్చితంగా సాధ్యం అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ది రాజాసాబ్( The Rajasaab ) సినిమాతో ప్రభాస్ కచ్చితంగా సక్సెస్ సొంతం చేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు ఈ సినిమా కచ్చితంగా భారీ హిట్ అందిస్తుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.ప్రభాస్ ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ అందుకుంటారని ప్రస్తుతం కొంతమంది హీరోలు మాత్రమే హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటున్నారని స్టార్ హీరో ప్రభాస్ కూడా ఈ జాబితాలో చేరడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ది రాజాసాబ్ మూవీ హిట్ కావడం పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నారు.ప్రభాస్ సైతం ఈ సినిమాకే ఎక్కువగా డేట్స్ కేటాయించారని తెలుస్తోంది.

2025 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమా విడుదల కానుండగా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.పెద్దగా పోటీ లేకుండానే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.ది రాజాసాబ్ సినిమాలో క్రేజీ హీరోయిన్లు ప్రభాస్ కు జోడీలుగా నటిస్తున్నారు.

Advertisement

ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమా కోసం విల్లా నిర్మించారని మారుతి( Maruthi ) ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన సెట్ సిద్ధమైందని భోగట్టా.

ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ప్రభాస్ భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

ట్యాక్స్ ట్యాక్స్ పేయర్ల కు ప్రభుత్వం ప్రత్యేక హక్కులు కల్పించాల్సిందే.. కొరటాల శివ డిమాండ్..?
Advertisement

తాజా వార్తలు