రియల్ పామిస్ట్ ఆధారంగా తెరకెక్కుతున్న రాధే శ్యామ్.. ప్రభాస్ క్యారెక్టర్ ఆయనదేనా?

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ రాధే శ్యామ్.ఈ సినిమాను ఇటలీ బ్యాక్ గ్రాఫ్ లో రూపొందిస్తున్నాడు.

దర్శకుడు కెకె రాధా క్రిష్ణ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వింటేజ్ ప్రేమకథగా జనాల ముందుకు రానుంది.ఈ సినిమాలో విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడు.

ఇంతకీ ఈ విక్రమాదిత్య ఎవరు? అనే విషయాన్ని తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో వెల్లడించాడు దర్శకుడు.ఇంతకీ దర్శకుడు చెప్పిన తాజా ముచ్చట ఏందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఈ సినిమా టీజర్ లో ప్రభాస్ పామిస్ట్ గా కనిపించాడు.నాపేరు విక్రమాదిత్య.నేను దేవుడిని కాదు.

Advertisement
Prabhas Character In Radhe Shyam Movie , Prabhas, Radhe Shyam, Movie, Vikramadit

కానీ మీలో నేను ఒకడిని కూడా కాదు అంటూ ఆయన క్యారెక్టర్ గురించి చెప్తాడు.కొత్త లుక్ తో పాటు బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కొత్తగా ఉన్నాయి.

దర్శకుడు.ప్రభాస్ క్యారెక్టర్ ను రియల్ పామిస్ట్ ఆధారంగా రూపొందించినట్లు తెలుస్తోంది.

ప్రభాస్ క్యారెక్టర్ కు ప్రేరణ మరెవరో కాదు.విలియం జాన్ వార్నర్ అని తెలుస్తంది.

ఈయన ప్రముఖ ఐరిష్ పామిస్ట్.ప్రముఖుల మరణాలు, ప్రపంచలోనే వింత ఘటనల గురించి ముందుగానే చెప్పిన వ్యక్తి ఈయన.1880లో ఈయన భారత్ లోనే జ్యోతిష్య శాస్త్రంలో మెళకువలు నేర్చుకున్నట్లు తెలుస్తోంది.

Prabhas Character In Radhe Shyam Movie , Prabhas, Radhe Shyam, Movie, Vikramadit
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

తాజాగా విడుదల అయిన ఈ టీజర్ లో ఇండియన్ ఎమర్జెన్సీని ముందే గుర్తించిన వ్యక్తి అంటూ ప్రభాస్ ఫోటో వేస్తారు.అయితే ఇండియాలో ఎమర్జెన్సీ ఉంటుంది అనే విషయాన్ని ముందుగా చెప్పిన వ్యక్తి చెయిరో కావడం విశేషం.అందుకే ఆయన కథ ఆధారంగానే రాథేశ్యామ్ తెరెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

సైన్స్ కి, జ్యోతిష్యానికి మధ్యన లింక్ పెడుతూ 1970 నాటి ప్రేమ కథను రూపొందిస్తున్నాడు దర్శకుడు.అయితే భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా జనాలను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనే విషయాన్ని చూడాలి.

కాగా ఈ సినిమా2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న రీలీజ్ కానుంది.

తాజా వార్తలు