యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Rebel Star Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా జూన్ 16వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఆకట్టుకునే భారీ విజువల్స్ తో ఈ సినిమా ఉండబోతుంది.
ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ గ్రాఫిక్స్ మూవీగా ఈ సినిమా ఉండబోతుంది అంటూ దర్శకుడు ఓమ్ రౌత్( Director Om Raut ) ప్రకటించిన విషయం తెల్సిందే.అంతే కాకుండా ఈ సినిమా రామాయణంను కొత్తగా చూపించబోతుంది అంటూ కూడా యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.
రాముడి పాత్రలో ప్రభాస్ ను నటింపజేసిన విషయం తెల్సిందే.
అంతే కాకుండా ఈ సినిమా లో సీత పాత్ర లో కృతి సనన్( Kriti Sanon ) నటించిన విషయం తెల్సిందే.సైఫ్ అలీ ఖాన్ ను విలన్ పాత్రలో నటింపజేస్తున్నారు.రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్( Saif Ali Khan ) ను సరికొత్తగా చూడబోతున్నారు.
ఈ సినిమా విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది.దాంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు సందడి మొదలు అవ్వాల్సి ఉంది.కానీ ఇప్పటి వరకు చిత్ర యూనిట్ సభ్యులు మెల్ల మెల్లగానే కార్యక్రమాలు చేస్తున్నారు.
ఏమాత్రం జోరు పెంచక పోవడంతో ప్రభాస్ అభిమానులు( Prabhas Fans ) అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్ రెండు మూడు వారాల ముందు ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అయితే సరిపోతుందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.పాన్ వరల్డ్ మూవీ అంటూ ప్రచారం చేయడం కాదు.
అందుకు తగ్గట్లుగా పబ్లిసిటీ చేయాలి కదా అంటూ చాలా మంది ట్రోల్స్( Trolls ) చేస్తున్నారు.సినిమా ను జనాల్లోకి తీసుకు వచ్చేందుకు భయపడుతున్నారు.ఏమైనా సమస్య ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఈ సినిమా తో ప్రభాస్ స్తాయి మరింతగా పెరగాలని అభిమానులు కోరుకుంటున్నారు.అది ఎంత వరకు సాధ్యం అనేది చూడాలి.
ఆదిపురుష్ ను విదేశీ భాషల్లో విడుదల విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటారట.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy