ప్రభాస్ ఒక్క ఇంటర్వ్యూ లేకుండానే ప్రమోషన్‌ ఎలా?

యంగ్ రెబల్‌ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా రూపొందిన ఆదిపురుష్ సినిమా( Adipurush movie ) ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.జూన్‌ 12వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.

రూ.550 కోట్ల బడ్జెట్‌ తో రూపొందిన ఈ సినిమా అందుకు తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.రికార్డు స్థాయి వసూళ్లు ఈ సినిమా కి సాధ్యం అంటూ అభిమానులు నమ్మకంతో ఉన్నారు.

ఎంతటి గొప్ప సినిమా అయినా కూడా ఖచ్చితంగా భారీ ప్రమోషన్స్( Cinema pramotions ) చేస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది.అలా కాదని సినిమా ను డైరెక్ట్‌ గా థియేటర్లకు తీసుకు వస్తే కచ్చితంగా నిరాశ తప్పదు అనే విషయం గతంలో పలు సందర్భాల్లో నిరూపితం అయ్యింది.

ప్రభాస్ హీరో గా ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఎన్నో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.అయితే బాహుబలి తర్వాత వచ్చిన సాహో మరియు రాధేశ్యామ్‌ సినిమా లు నిరాశ పర్చాయి.

ఆ సినిమాలు డిజాస్టర్‌ అయినా కూడా ఆదిపురుష్‌ యొక్క ప్రీ రిలీజ్ బజ్ ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉంది.అందుకు తగ్గట్లుగా ప్రమోషన్‌ చేస్తే బాగుంటుంది కదా.కానీ ఆదిపురుష్‌ యూనిట్‌ సభ్యులు మాత్రం పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాలేదు.ఇప్పటి వరకు ఒక్క ఇంటర్వ్యూ లేదు.

Advertisement

ముఖ్యంగా ప్రభాస్ యొక్క ఇంటర్వ్యూ లు లేకపోవడంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.చిత్ర హీరో హీరోయిన్‌ దర్శకుడు నిర్మాతలు ఇలా ఏ ఒక్కరు కూడా సినిమా ప్రమోషన్‌ లో కనిపించడం లేదు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్యాన్స్ వరకు సినిమా వెళ్లింది.జనాల్లోకి ఇంకా వెళ్లాలి అంటే ప్రమోషన్‌ చేయాలి కదా అంటూ కొందరు సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు