పేలు కుట్టి కుట్టి చంపుతున్నాయా.. ఈ పవర్ ఫుల్ ఆయిల్ ను వాడితే వాటిని ఈజీగా తరిమికొట్టొచ్చు!

పేలు.( Lice ) చాలా మంది వీటితో సతమతం అవుతుంటారు.

ముఖ్యంగా పిల్లలు, కాలేజ్ కి వెళ్లే స్టూడెంట్స్ లో పేలు చాలా ఎక్కువగా ఉంటాయి.

తలలో పేలు ఉండడం వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

ఎప్పుడు చూసినా తలను గోకుతూ ఉంటారు.పైగా తలలో పేలు ఉండడం వల్ల చాలా మంది రక్తహీనత బారిన కూడా పడతారు.

పేలుకు మన రక్తమే ఆహారం.అందువల్ల అవి మన రక్తాన్ని( Blood ) పీల్చేస్తాయి పైగా తలలో పేలు ఉంటే స్కాల్ప్ ఆరోగ్యం పాడవుతుంది.

Advertisement

జుట్టు అధికంగా రాలిపోతుంది.మరెన్నో సమస్యలు తలెత్తుతాయి.

ఈ నేపథ్యంలోనే పేలును వదిలించుకునేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.మిమ్మల్ని కూడా పేలు కుట్టి కుట్టి చంపుతున్నాయా.

డోంట్ వర్రీ.ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్ ఆయిల్ లో కనుక వాడితే ఈజీగా పేలును త‌రిమికొట్టవచ్చు.

మరి ఇంకెందుకు లేటు ఆ ఆయిల్ ను( Lice Oil ) ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

అల్లంతో అధిక హెయిర్ ఫాల్ పరార్.. ఎలా వాడాలంటే?
అక్కడ నాని మూవీ కేవలం 5 థియేటర్లలో రిలీజవుతోందా.. అసలేం జరిగిందంటే?

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) వేసుకోవాలి.అలాగే ఒక కప్పు ఫ్రెష్ వేపాకుతో ( Neem Leaves ) పాటు గుప్పెడు మర్రి చెట్టు వేర్లు వేసి పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.చివరిగా కొంచెం వట్టివేరు కూడా వేసి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

Advertisement

ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

ఈ ఆయిల్ ను తలకు పట్టించి కనీసం ప‌ది నిమిషాల పాటు బాగా మసాజ్ చేసుకోవాలి.నైట్ నిద్రించే ముందు ఆయిల్ ను అప్లై చేసుకుని మరుసటి రోజు షాంపూ చేసుకోవాలి.ఈ ఆయిల్ పేలును వదిలించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

మూడు రోజులకు ఒకసారి ఈ ఆయిల్ ను కనుక రాసుకుంటే కొద్ది రోజుల్లోనే పేలు అన్నీ మాయమవుతాయి.కాబట్టి పేలు సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ ఆయిల్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు