పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!

పొడి దగ్గు.దీనినే డ్రై కాఫ్( Dry coffee ) అని అంటారు.

సీజన్ తో పని లేకుండా అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఇది ఒకటి.పైగా పొడి దగ్గు పట్టుకుంది అంటే అంత సులభంగా వదిలిపెట్టదు.

గాలి పీల్చుకునే గ్యాప్ కూడా లేకుండా నిరంతరం దగ్గు వస్తూనే ఉంటుంది.ఈ దగ్గు కారణంగా రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర సైతం పట్టదు.

ఈ క్రమంలోనే పొడి ద‌గ్గును వదిలించుకోవడం కోసం ఎన్నెన్నో మందులు, కాఫ్ సిరప్స్ ను వాడుతుంటారు.అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తెలీక తీవ్రంగా మదన పడుతుంటారు.

Advertisement

అయితే ఇకపై అస్సలు చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని పాటిస్తే పొడి దగ్గు దెబ్బకు పరార్ అయిపోతుంది.

మరి ఇంకెందుకు లేటు పొడి దగ్గును తరిమికొట్టే ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఎనిమిది నుంచి పది లవంగాలు వేసి స్లైట్ గా వేయించాలి.

ఆ తర్వాత ఆరు వెల్లుల్లి రెబ్బలను( garlic ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి పెట్టుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని అందులో వేయించుకున్న లవంగాలు( cloves ), పొట్టు తొలగించి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి.చివరిగా నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు తేనె( Honey ) వేసి స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రెండు పూటలు అంటే ఉదయం మరియు సాయంత్రం వన్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

ఇలా చేస్తే వెల్లుల్లి లవంగాలు మరియు తేనెలో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్లు దగ్గును చాలా వేగంగా తరిమి కొట్టడానికి అద్భుతంగా సహాయపడతాయి.

Advertisement

కేవలం మూడు రోజులు ఈ రెమెడీని వరసగా పాటిస్తే ఎలాంటి దగ్గు అయినా దెబ్బకు పరార్ అవుతుంది.కాబట్టి ఎవరైతే దగ్గు సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారో వారు తప్పకుండా ఈ సింపుల్ హోమ్ రెమెడీని పాటించండి.పైగా ఈ రెమెడీని పాటిస్తే జలుబు ఉన్నా సరే దూరమవుతుంది.

అదే సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.మ‌రియు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా సైతం మారుతుంది.

తాజా వార్తలు