ఆ స్టార్ హీరోలకు దిమ్మతిరిగే షాకిచ్చిన పవన్ కళ్యాణ్.. డేట్ విషయంలో మార్పు లేనట్టేనా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.

గతేడాది పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలేవీ థియేటర్లలో రిలీజ్ కాలేదు.

ఈ ఏడాది పవన్ హరిహర వీరమల్లు,( Hari Hara Veeramallu ) ఓజీ సినిమాలతో( OG Movie ) ప్రేక్షకుల ముందుకు రానున్నారు.మొదట ప్రకటించిన డేట్ ప్రకారం మార్చి నెల 28వ తేదీన హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే రాబిన్ హుడ్,( Robinhood ) మ్యాడ్ స్క్వేర్( Mad Square ) సినిమాలు అదే సమయానికి రిలీజ్ అవుతుండటంతో హరిహర వీరమల్లు మూవీ వాయిదా పడినట్టేనని అందరూ అనుకున్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుంచి బాబీ డియోల్( Bobby Deol ) లుక్ రిలీజ్ కాగా ఈ పోస్టర్ లో మార్చి నెల 28వ తేదీన హరిహర వీరమల్లు మూవీని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

హరిహర వీరమల్లు రేసులోనే ఉందని క్లారిటీ వచ్చేసింది.

Advertisement

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మాట వినాలి సాంగ్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.హరిహర వీరమల్లు మూవీ కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది.

పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 50 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర భాషల్లో సైతం కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడంతో పాటు సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకొని సంచలన రికార్డులను క్రియేట్ చేస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమాలకు ఓకే చెబితే బాగుంటుందని ఈ హీరో అభిమానులు ఫీలవుతున్నారు.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు